ENGLISH | TELUGU  

'దసరా'పై నాని నమ్మకానికి ఈ మాటలే నిదర్శనం!

on Feb 7, 2023

ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని కొత్త దర్శకుడు అయిన శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో దసరా అనే చిత్రంలో నటిస్తున్నారు.  నాని నటిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రమిది. ఇందులో ఆయన ర‌గ్గ్ డ్ లుక్ లో   కనిపిస్తున్నారు.  ఒక యాంగిల్ లో చూస్తే పుష్పాలోని  అల్లు అర్జున్ లుక్  గుర్తుకురాక మానదు. ఈ విషయంపై నాని పై ట్రోలింగ్ కూడా జరిగింది. ఇక తాజాగా ఈ చిత్రం గురించి నాని మాట్లాడుతూ కొన్ని విషయాలు తెలిపాడు. అవి వింటే కానీ ఈ మాటలను నమ్మకంతో చెప్పాడా లేక అతి నమ్మకంతో చెప్పాడా అనే అనుమానం రాకమానదు.

ఇది కాన్ఫిడెన్‌సా లేక   ఓవర్ కాన్ఫిడెన్సా  అనేది తెలియాలంటే సినిమా విడుదల  దాకా వేచి చూడాలి. ఇక ఇంతకీ నాని ఏమి మాట్లాడాడు అంటే తెలుగు సినిమాకు ఇన్నాళ్లుగా నా సహకారం ఏంటో అంటూ చాలా ఆలోచించేవాడిని. తెలుగు సినిమాకు మాత్రమే కాకుండా ఇండియన్ సినిమాకు ఈ ఏడాది నా తరపు నుండి ఇస్తున్న సహకారం ఈ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదేలా.  ఈ మాట నేను ఎందుకు అంటున్నాను అనేది దసరా సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. గత ఏడాది తెలుగు నుండి ఆర్ఆర్ఆర్  కన్నడం నుండి కేజిఎఫ్ సినిమాలు వచ్చాయి. ఈ ఏడాది తెలుగు నుండి దసరా వస్తుంది అన్నారు. అంటే ఆయన ఏకంగా దసరా చిత్రాన్ని ఆర్ఆర్ఆర్,  కే జి ఎఫ్ లతో పోల్చడం చూస్తుంటే ఇది నాని నమ్మకమా అతి నమ్మకమా అనేది అర్థం కాకుండా ఉంది. అంతేకాదు చివరగా నాని మాట్లాడుతూ శ్రీకాంత్ ఓదెల... ఈ పేరు  గుర్తు పెట్టుకోండి అని ట్విట్ చేశారు.  

నాని మాట్లాడిన ఈ మాటలు దసరా విడుదల సమయంలో కచ్చితంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవటం ఖాయం. సినిమా ఫలితాన్ని బట్టి నాని మాటలకు కౌంటర్ పడే అవకాశం ఉంది. అవన్నీ నానికి తెలిసినా కూడా ఆయన ఈ విధంగా మాట్లాడాడంటే దసరాలో కచ్చితంగా ఎంతో దమ్ముండి ఉంటుంద‌ని  కొంతమంది నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మరి వారి నమ్మకాన్ని నాని ఎంతవరకు నిలబెడతాడు వేచి చూడాలి.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.