యశోద కలెక్షన్స్.. అక్కినేని హీరోలపై సమంత ఫ్యాన్స్ ట్రోల్స్!
on Nov 13, 2022

నాగ చైతన్య, సమంత విడిపోయినప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా అక్కినేని అభిమానులు, సమంత అభిమానుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. సమంత తాజా చిత్రం 'యశోద' కారణంగా ఈ వార్ మరోసారి తెరపైకి వచ్చింది. సమంత అభిమానులు 'యశోద' కలెక్షన్స్ తో అక్కినేని హీరోల సినిమాల కలెక్షన్స్ ని పోల్చుతూ ట్రోల్ చేస్తున్నారు.
యశోద మూవీ నవంబర్ 11న థియేటర్స్ లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు రూ.2.94 కోట్ల షేర్, రెండో రోజు రూ.2.82 కోట్ల షేర్ తో రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.5.76 కోట్ల షేర్ తో సత్తా చాటింది. ఇది నాగ చైతన్య గత చిత్రం 'థాంక్యూ', నాగార్జున గత చిత్రం 'ది ఘోస్ట్' కంటే ఎక్కువ మొత్తం కావడంతో సమంత ఫ్యాన్స్ అక్కినేని హీరోలపై సెటైర్స్ వేస్తున్నారు. రెండు రోజుల్లో థాంక్యూ రూ.3.10 కోట్ల షేర్, ది ఘోస్ట్ రూ.3.36 కోట్ల షేర్ రాబడితే.. యశోద మాత్రం రూ.5.76 కోట్ల షేర్ కలెక్ట్ చేసిందని, అది సమంత రేంజ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
అయితే సమంత ఫ్యాన్స్ చేస్తున్న ట్రోల్స్ ని అక్కినేని ఫ్యాన్స్ కూడా అదేస్థాయిలో తిప్పికొడుతున్నారు. ప్లాప్ సినిమాలతో పోల్చడం కాదని.. 'లవ్ స్టోరీ', 'బంగార్రాజు' సినిమాల ఓపెనింగ్స్ తో పోల్చితే యశోద ఓపెనింగ్స్ అందులో సగం కూడా ఉండవని కౌంటర్ ఇస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



