మార్చి మొదటి వారంలో 'జతగా...'
on Feb 10, 2016
వరుసగా విజయవంతమైన చిత్రాలు అందించడం అంటే ఆషామాషీ కాదు. పైగా, కేవలం కమర్షియల్ హిట్ చిత్రాలుగా మాత్రమే కాకుండా, ప్రేక్షకుల హృదయాలను కూడా తాకే చిత్రాలుగా పేరు తెచ్చుకోవడం అంటే చిన్న విషయం కాదు. 'ప్రేమిస్తే' నుంచి 'డా.. సలీమ్' వరకు సురేశ్ కొండేటి అందించిన పదకొండు చిత్రాలూ ఈ కోవకే వస్తాయి. ఫీల్ గుడ్ కమర్షియల్ ఎంటర్ టైనర్స్ గా ప్రేమిస్తే, షాపింగ్ మాల్, జర్నీ, రేణిగుంట, పిజ్జా, మహేశ్, డా. సలీమ్.. ఇలా సురేశ్ అందించిన అన్ని చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుని ఆయనకు మంచి నిర్మాత అనే పేరు తెచ్చాయి. ఇప్పుడు సురేశ్ కొండేటి పన్నెండో సినిమాగా 'జతగా'ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రవిశేషాల్లోకి వస్తే..
మలయాళంలో హిట్ పెయిర్ అనిపించుకుని, 'ఓకే బంగారం'తో తెలుగు, తమిళ ప్రేక్షకులతో కూడా మంచి జోడీ అనిపించుకున్న దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా రూపొందిన మలయాళ చిత్రం 'ఉస్తాద్ హోటల్'. ఈ చిత్రాన్ని 'జతగా...' పేరుతో తెలుగులోకి అనువదించారు సురేశ్ కొండేటి. అన్వర్ రషీద్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.
ప్రస్తుతం ఈ చిత్రం తొలి కాపీ సిద్ధమైంది. మార్చి మొదటివారంలో 'జతగా'ని విడుదల చేయాలనుకుంటున్నారు. చిత్రవిశేషాలను సురేష్ కొండేటి తెలియజేస్తూ - "మలయాళంలో మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచిన చిత్రమిది. కథ-కథనంతో పాటు దుల్కర్, నిత్యామీనన్ల జంట ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. లవ్,సెంటిమెంట్, పేద, ధనిక వర్గాల మధ్య ఉండే భేదం.. తదితర అంశాల సమాహారంతో రూపొందిన చక్కని ఫీల్ గుడ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది. సాహితి రాసిన సంభాషణలు హైలైట్ గా నిలుస్తాయి. మా సంస్థలో వచ్చిన'జర్నీ', 'పిజ్జా', 'డా. సలీమ్' చిత్రాలకు ఆయన మంచి సంభాషణలు అందించారు. ఇప్పుడు 'జతగా...'కి కూడా అద్భుతమైన మాటలు రాశారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణ అవుతాయి''అని చెప్పారు. ఇప్పటి వరకూ సురేశ్ కొండేటి అందించిన చిత్రాలన్నీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో, జతగా సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మళయాళంలో దుల్కర్ నిత్యామీనన్ ఈ సినిమా తర్వాత హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకోవడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



