' వంగవీటి ' వర్మ చివరి చిత్రమా...?
on Feb 10, 2016

పబ్లిసిటీలో వర్మ ఇండియాలోనే టాప్ అన్న విషయంలో ఎవరికీ సందేహాల్లేవు. కానీ ఇప్పుడు వంగవీటి చివరిచిత్రం అనడంతో, ఇది నిజమో అబద్ధమో తెలియక ఆయన అభిమానులు బెంగ పెట్టుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే, వర్మ తెలుగులో సినిమాలు తీయకపోతే, మీడియాకి కూడా ఇబ్బందే..ఎప్పుడూ ఏదో ఒక పబ్లిసిటీ స్టంట్ చేస్తూ వార్తల్లో నిలిచే వర్మ లేకపోతే, మీడియాకు ఒక ఆసక్తికర అంశం కంప్లీట్ గా మిస్ అయినట్టే.
ఏదేమైనా వర్మ రూటే సెపరేటు. సినిమా చేసినా చేయకపోయినా, నిరంతరం వార్తల్లో, ప్రజల నోళ్లలో ఎలా నలగాలో ఆయనకు తెలిసినట్టు ఎవరికీ తెలియదు. " యు కెన్ లవ్ మి ఆర్ హేట్ మి బట్ యు కెనాట్ ఇగ్నోర్ మి " అన్న ఇంగ్లీష్ వాక్యంలా, వర్మను తిట్టుకునేవాళ్లు, పొగిడేవాళ్లు ఉంటారు తప్ప వర్మ గురించి మాట్లాడని వాళ్లు మాత్రం ఉండరంటే ఆశ్చర్యం లేదేమో..మరి ఈ పబ్లిసిటీ కింగ్ గారి ' వంగవీటి ' సినిమా నిజంగానే తన చివరి తెలుగు పీచర్ ఫిల్మా..? అంటే ఇక తెలుగులో సినిమాలు చెయ్యరా.. లేక ఇది ఆ సినిమా ప్రమోషన్ కోసం వేసిన బిస్కెట్టా..? నిజానిజాలు వర్మకెరుక..!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



