మలైకా, అర్జున్ వ్యవహారాన్ని డ్రైవర్ లీక్ చేశాడా?
on Aug 28, 2020

మలైకా అరోరా, అర్బాజ్ ఖాన్ విడిపోయిన విషయం తెలిసిందే. అప్పట్నుంచీ తన కంటే వయసులో చాలా చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో మలైకా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది. గత ఏడాది అర్జున్‌తో మలైకా వ్యవహారం నడుపుతున్న విషయాన్ని ఆమె డ్రైవర్ ముఖేష్.. తన సోదరుడు బబ్లూకు లీక్ చేశాడనే విషయం బయటకు వచ్చింది. అర్బాజ్ ఖాన్ దగ్గర బబ్లూ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
గత ఏడాది నుంచీ మలైకా, అర్జున్ కలిసి తిరుగుతూ కెమెరాలకు చిక్కారు. ఒకసారి బీచ్‌లో అర్జున్ బుగ్గ మీద ముద్దు పెడుతున్న మలైకా కనిపించగా, ఇంకోసారి డిన్నర్ చేసి వస్తూ, చేయీ చేయీ కలిపి జోరుగా నడుస్తూ ఆ ఇద్దరూ పాపరాజ్జికి దొరికిపోయారు. ఇలా అనేక ప్రదేశాల్లో వారు కలిసి కనిపించారు. అయితే ఆ ఇద్దరి మధ్యా వయసు తారతమ్యం రీత్యా మలైకా, అర్జున్ ఇద్దరూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ వస్తున్నారు. అయినప్పటికీ వాళ్లు వాటినేమీ పట్టించుకోకుండా, తమ బంధాన్ని మరో లెవల్‌కు తీసుకువెళ్లాలని భావిస్తున్నారు.
.jpg)
అర్జున్, మలైకా మధ్య సన్నిహితత్వం పెరుగుతుండటంపై అర్జున్ తండ్రి బోనీ కపూర్, మలైకా మాజీ బావ సల్మాన్ ఖాన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని బాలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు. బోనీ, అర్జున్‌లను తన ఇంటికి రాకుండా సల్మాన్ నిషేధించినట్లు కూడా వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో అర్జున్‌తో తన అనుబంధం వ్యవహారాన్ని బబ్లూకు తన డ్రైవర్ ముఖేష్ చేరవేశాడని మలైకా సందేహించినట్లు ప్రచారంలోకి వచ్చింది. తన డ్రైవర్ సోదరుడైన ముఖేష్‌ను మలైకా డ్రైవర్‌గా అర్బాజ్ ఉద్యోగమిచ్చాడంటున్నారు. ఆ ఇద్దరూ విడిపోయినప్పటికీ వారి డ్రైవర్లుగా బబ్లూ, ముఖేష్ కొనసాగుతూనే ఉన్నారు. తన ప్రైవేట్ వ్యవహారాల్ని బబ్లూకు చెబితే ఊరుకునేది లేదని ముఖేష్‌కు మలైకా వార్నింగ్ ఇచ్చిందంట.
అర్జున్ కపూర్, మలైకా అరోరా పెళ్లికి బోనీ సోదరులైన అనిల్ కపూర్, సంజయ్ కపూర్‌తో పాటు జాన్వీ కపూర్ కూడా అంగీకారం తెలపగా, బోనీ, అర్జున్ తోబుట్టువులు అన్షులా, సోనమ్ కపూర్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



