Home

»

Latest News

ఓటీటీకి సుకుమార్ స్నేహితుడి సినిమా

Aug 28, 2020

దర్శకుడిగా అగ్ర కథానాయకులతో సినిమాలు తీసే సుకుమార్, తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. స్నేహితులు, శిష్యుల సినిమాలకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. సహాయం చేస్తుంటారు. ప్రాణ స్నేహితుడు ఒకరు ఈ లోకాన్ని విడిచి వెళ్ళితే... అతడు నిర్మించిన సినిమాను ప్రేక్షకుల ముందుకు బాధ్యతను సుకుమార్ తన భుజాలపై వేసుకున్నారు.

సుకుమార్ ఆప్తమిత్రుడు, కొన్ని రోజుల క్రితం మరణించిన ప్రసాద్ 'అమరం అఖిలం ప్రేమ' అని ఒక సినిమా నిర్మించారు. అది విడుదల కాకముందే ఆయన ప్రాణాలు విడిచివెళ్ళారు. జోనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఆ సినిమాను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయడానికి సుకుమార్ ప్లాన్ చేశారు. అల్లు అరవింద్ నేతృత్వంలోని 'ఆహా' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకుంది. సెప్టెంబర్ రెండో వారంలో సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. టైటిల్ బట్టి ప్రేమకథ నేపథ్యంలో సినిమా రూపొందిందని ఊహించవచ్చు. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com