పేరేమో 'డబుల్' ఇస్మార్ట్.. పెయిరేమో 'సింగిల్' బ్యూటీ.. పూరీ సార్ ఏంటిది?
on Sep 19, 2023
'ఇస్మార్ట్ శంకర్'.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి మాస్ లో మాంచి ఇమేజ్ తెచ్చిన మసాలా మూవీ. ఇందులో డబుల్ ధిమాక్ పోరగాడు శంకర్ గా, ఉస్తాద్ గా భలేగా ఎంటర్టైన్ చేశాడు రామ్. అలాగే అతనికి జోడీగా చిందులేసిన నభా నటేశ్, నిధి అగర్వాల్ కూడా మస్త్ వినోదాన్ని పంచారు. ఇక డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ టేకింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఇదిలా ఉంటే, దాదాపు ఐదేళ్ళ తరువాత 'ఇస్మార్ట్ శంకర్'కి సీక్వెల్ గా 'డబుల్ ఇస్మార్ట్' పేరుతో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ చిత్రంలో రామ్ కథానాయకుడుగా కొనసాగుతుండగా.. నభా, నిధి మాత్రం మిస్ అవుతున్నారు. అయితే, ఇందులో వారిద్దరికి బదులుగా ఓ బాలీవుడ్ హీరోయిన్ సందడి చేయనుందని సమాచారం. ఆమె.. మరెవరో కాదు సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్. త్వరలోనే 'డబుల్ ఇస్మార్ట్'లో సారా ఎంట్రీపై క్లారిటీ రానుంది.
కాగా, పేరులో 'డబుల్' ఇస్మార్ట్ అని ఉన్నా.. 'ఇస్మార్ట్ శంకర్'లో మాదిరిగా ఇద్దరు నాయికలు కాకుండా హీరోకి పెయిర్ గా కేవలం సింగిల్ బ్యూటీనే ఎంటర్టైన్ చేయనుందనే వార్తలు చూసి.. "పూరీ సార్ ఏంటిది?" అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. 2024 మార్చి 8న 'డబుల్ ఇస్మార్ట్' తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
