ప్రభుత్వాసుపత్రిలో పోస్టు మార్టం.. కన్నీళ్ళతో విజయ్ నిరీక్షణ..
on Sep 19, 2023
ప్రముఖ సంగీత దర్శకుడు, కథానాయకుడు విజయ్ ఆంటోని కుమార్తె మీరా (16) ఈ రోజు (మంగళవారం) ఉదయం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్లస్ టు చదువుతున్న మీరా.. చదువుల ఒత్తిడి వల్లే సుసైడ్ చేసుకుంటున్నట్లు కథనాలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే, విజయ్ ఆంటోని కుమార్తె మీరా మృతదేహానికి చెన్నైలోని ఒమంతురార్ ప్రభుత్వాసుప్రతిలో ప్రస్తుతం పోస్టుమార్టం జరుగుతోంది. విజయ్ తో పాటు అతని కుటుంబ సభ్యులు హాస్పిటల్ బయట కన్నీళ్ళతో నిరీక్షిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో పోస్టు మార్టం పూర్తి కానుంది. కాగా, మీరా అంత్యక్రియలు ఈ రోజే నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. పలువురు సినీ ప్రముఖులు విజయ్ ఆంటోనికి సంతాపం తెలియజేస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
