'మజిలీ' హీరోయిన్‌కి మహా చాన్స్!
on Apr 13, 2021
యువ సామ్రాట్ నాగచైతన్య కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిన చిత్రం 'మజిలీ'. తన శ్రీమతి, అగ్ర కథానాయిక సమంత ఇందులో మెయిన్ లీడ్ గా నటించగా.. కొత్తమ్మాయి దివ్యాంశ కౌశిక్ సెకండ్ లీడ్ గా దర్శనమిచ్చింది. కాగా, 'మజిలీ' బ్లాక్ బస్టర్ అయినప్పటికీ దివ్యాంశకి ఎందుకనో వెంటనే అవకాశాలు దక్కలేదు.
'మజిలీ' విడుదలైన దాదాపు రెండేళ్ళ తరువాత ఇటీవల నాగశౌర్య 'పోలీస్ వారి హెచ్చరిక'లో హీరోయిన్ గా ఎంపికైంది దివ్యాంశ. ఆ సినిమా నిర్మాణ దశలో ఉండగనే.. తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో ఆఫర్ దక్కించుకుని టాక్ ఆఫ్ టాలీవుడ్ అయిందీ ముద్దుగుమ్మ. అది కూడా.. ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కావడం విశేషం.
ఆ స్టార్ మరెవరో కాదు.. మాస్ మహారాజా రవితేజ. ఉగాది సందర్భంగా ప్రారంభమైన రవితేజ కొత్త సినిమాలో ఓ నాయికగా దివ్యాంశ ఎంపికైంది. మరి.. శరత్ మండవ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ తోనైనా దివ్యాంశ దశ, దిశ మారుతాయేమో చూడాలి.
ఈ ఏడాది చివరలో రవితేజ - దివ్యాంశ కాంబో మూవీ థియేటర్స్ లో సందడి చేసే అవకాశముంది.