14 ఏళ్ళ 'ఢీ'
on Apr 13, 2021
వినోదాత్మక చిత్రాలకు చిరునామాగా నిలిచిన దర్శకుల్లో శ్రీను వైట్ల ఒకరు. ఒక దశలో ఈ స్టార్ డైరెక్టర్ వరుస విజయాలు చూశారు. అలాంటి విజయవంతమైన చిత్రాల్లో 'ఢీ' ఒకటి. ఈ సినిమాతోనే కథానాయకుడు మంచు విష్ణు తన కెరీర్ లో ఫస్ట్ సక్సెస్ అందుకున్నారు. విష్ణుకి జోడీగా జెనీలియా నటించిన ఈ యాక్షన్ రొమాంటిక్ కామెడీ డ్రామాలో శ్రీహరి, బ్రహ్మానందం, చంద్రమోహన్, ఆకాశ్, సునీల్, సుప్రీత్, అజయ్, జయప్రకాశ్ రెడ్డి, ప్రేమ, సంతోషి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
చక్రి సంగీత సారథ్యంలో రూపొందిన పాటల్లో "కనుపాపకు ఇది తెలుసా", "కొంచెం కొంచెం" ఆదరణ పొందాయి. శ్రీను వైట్ల - చక్రి కాంబినేషన్ లో వచ్చిన ఏకైక చిత్రమిదే కావడం విశేషం. తమిళంలో 'మిరట్టల్', బెంగాలీలో 'ఖోకాబాబు', ఒరియాలో 'తు మో గాళ్ ఫ్రెండ్' పేర్లతో 'ఢీ'ని రీమేక్ చేశారు. 2007 ఏప్రిల్ 13న విడుదలైన 'ఢీ'.. నేటితో 14 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
ఇదిలా ఉంటే.. త్వరలోనే 'ఢీ'కి సీక్వెల్ గా 'డి అండ్ డి - డబుల్ డోస్' పేరుతో విష్ణు - శ్రీను వైట్ల కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుండడం విశేషం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
