ఇకనుండి దర్శకత్వంపై మాత్రమే సుకుమార్ దృష్టి!
on Jan 11, 2023
.webp)
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయ్యారు. పుష్ప-ది రైజ్ చిత్రం పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే నార్త్ ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేసి 100 కోట్లు వసూలు చేసింది. ఇది మామూలు విషయం కాదు. ఉత్తరాదిన ప్రమోషన్స్ చేయకుండానే అలాంటి విజయాన్ని నమోదు చేయడం మామూలు విషయం కాదు. దీన్ని బట్టి సుకుమార్ స్థాయి ఏమిటో అర్థం అవుతుంది. నేడు సుకుమార్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు.
ఆయన ఒక బ్రాండ్ గా పాపులర్ అవుతున్నారు. ప్రస్తుతం సుకుమార్ పుష్ప-ది రూల్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. గత ఏడాదికాలంగా ఆయన పుష్ప2 మీదనే ఉన్నారు. అందుకే ఆయన మిగిలిన విషయాలు పట్టించుకోవడం లేదు. గతంలో సుకుమార్ పలు చిన్న చిత్రాలకు సహనిర్మాతగా వ్యవహరిస్తూ సుకుమార్ రైటింగ్స్ పై చిత్రాలు నిర్మించారు. కుమారి 21 ఎఫ్, దర్శకుడు, ఉప్పెన వంటి చిత్రాలకు నిర్మాతగానే కాదు... తన శిష్యులు తెరకెక్కించిన చిత్రాలకు రచయితగా కూడా పనిచేశారు. వాటికి రచన, స్క్రీన్ ప్లేలలో సహకారం అందించారు.
కానీ ఇకపై మాత్రం అలా చేయడట. చిన్న సినిమాలు జోలికి అతను వెళ్లకూడదని నిర్ణయించుకున్నారట. ఇటీవల విడుదలైన 18 పేజెస్ సినిమాకి కూడా సుకుమార్ రచనా సహకారం అందించారు. అంతేకాదు గీత ఆర్ట్స్ 2తో కలిసి సహనిర్మాతగా ఉన్నారు. కానీ పుష్ప2 పనులలో బిజీగా ఉండడం వల్ల ఆయన ప్రమోషన్స్ లో పాల్గొనలేదు. సుకుమార్ ఇకనుండి ఇతర దర్శకుల సినిమాల్లో వేలు పెట్టకూడదని నిర్ణయించుకున్నాడట. స్క్రీన్ ప్లే, రచయితగా పనిచేయడం ఆపేస్తున్నారట. ప్రస్తుతం ఆయన సాయిధరమ్ తేజ్ నటిస్తున్న విరూపాక్ష చిత్రానికి సహ నిర్మాతగా ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కానీ ఆ సినిమాకు సుకుమార్ ఎలాంటి రచన సహకారం అందించడం లేదు. ప్రమోషన్స్ తో పాటు ఇతర విషయాల్లో కూడా ఆయన ఇకపై తన ప్రమేయం లేకుండా చూసుకుంటున్నారు.
దాంతో కేవలం సాయి ధరమ్ తేజ్ పేరుతోనే ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అందుకే చిన్న సినిమాలతో ఇమేజ్‌కి డామేజ్ కలిగించుకోవద్దని భావిస్తున్నాడట. ఇప్పుడు గతంలో మాదిరి కాదు. ఆయన నేడు పాన్ ఇండియా లెవల్లో ఆయన ప్రముఖ దర్శకునిగా మారారు. దాంతో ఇక చిన్న సినిమాలు సుక్కు గుడ్ బై చెప్పేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



