వాల్తేరు వీరయ్యపై పుకార్లను కొట్టి పారేసిన చిరు!
on Jan 11, 2023

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకుడు బాబి. అన్నయ్య చిత్రం తర్వాత దాదాపు 22 ఏళ్ల విరామంలో మాస్ మహారాజా రవితేజ చిరు చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కీలకమైన పాత్రలో రవితేజ నటింస్తున్నారు. ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించినట్టు అర్థమవుతుంది. లావిష్ గా యాక్షన్ సీన్స్, ఫారిన్ లొకేషన్స్, విలన్ గ్యాంగ్ ను చూపించిన విధానం వీటన్నిటిని చూస్తుంటే ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌లో నిర్మించారని, బడ్జెట్ భారీగా పెరిగిపోయిందని ప్రచారం జరుగుతుంది.
చిరు తన కెరీర్ లో చేసిన ఓవర్ బడ్జెట్ ఫిలిం ఇదే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. వాల్తేరు వీరయ్య ఓవర్ బడ్జెట్ ఫిలిం కాదు. ఇందులో సింగిల్ ఫ్రేమ్ కూడా వేస్ట్ కాలేదు. ప్రతి సీన్ ఎడిటింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. ఈ సినిమా మరింత షార్ప్ గా ఉండాలనే ఆలోచనతో ఐదు నిమిషాల నిడివిని కట్ చేశారు. సినిమాను అనుకున్న ప్రకారం అనుకున్న ముందుగా వేసుకున్న బడ్జెట్ లోనే పూర్తి చేశాం. ఎక్కడా బడ్జెట్ పెరగలేదు... అని చెప్పుకొచ్చారు. ఈ మూవీపై భారీ క్రేజ్ ఏర్పడటంతో నాన్ ధియేటర్ రైట్స్ పరంగా భారీ ఆఫర్ వచ్చిందట.
ఈ విషయంలో మేకర్స్ లాభాల్లో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఇక థియేటర్లలో చిరు- రవితేజ కనిపించే సన్నివేశాలు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించడం ఖాయం అని చెబుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



