లైంగిక వేధింపుల కేసులో శంకర్ అల్లుడు.. షాక్‌లో కోలీవుడ్!
on Oct 21, 2021
దేశంలోని టాప్ డైరెక్టర్స్‌లో ఒకరిగా పేరు ప్రఖ్యాతులు పొందారు శంకర్. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఒకట్రెండు మినహా మిగతావన్నీ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించాయి. కమల్ హాసన్ 'ఇండియన్ 2' (భారతీయుడు 2) మూవీ వివాదంతో వార్తల్లో నిలిచిన శంకర్, మరోసారి రాంగ్ రీజన్‌తో హెడ్‌లైన్స్‌లో నిలిచారు. ఆయన అల్లుడు రోహిత్ పోక్సో చట్టం కింద ప్రాసిక్యూషన్‌కు గురయ్యాడనేది ఆ వార్త. ఈ న్యూస్ సినీ వర్గాలను షాక్‌కు గురిచేసింది.
పాండిచ్చేరిలో ఒక క్రికెట్ ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా 16 సంవత్సరాల బాలికను కోచ్ తమరై కణ్ణన్ లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై క్రికెట్ బోర్డుకు బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటికీ, కోచ్‌తో గొడవలు వద్దని బోర్డు అధికారులు ఆమెకు సూచించనట్లు సమాచారం.
అధికారులు తీరుతో షాక్‌కు గురైన ఆ బాలిక, చిల్డ్రన్స్ వెల్ఫేర్ కమిటీకి ఫిర్యాదు చేసింది. ఆ కమిటీ విచారణ జరిపి, మెట్టుపాలయమ్ పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ ఇచ్చారు. దాంతో పోక్సో యాక్ట్ కింద లైంగిక వేధింపులకు పాల్పడ్డ కోచ్ తమరై కణ్ణన్‌తో పాటు మరో కోచ్ జయకుమార్, క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దామోదరన్, సెక్రటరీ వెంకట్, క్రికెట్ టీమ్ కెప్టెన్ రోహిత్ (శంకర్ అల్లుడు), మరికొంతమైందిపై కేసు నమోదు చేశారు. దీంతో నిందితులు అజ్ఞాతంలోకి వెళ్లడంతో, పోలీసు అధికారులు వారిని వెతికే పనిలో పడ్డారు.
లైంగిక వేధింపుల కేసులో శంకర్ అల్లుడు ఉండటం కోలీవుడ్ వర్గాలను షాక్‌కు గురిచేసింది. ఈ సమస్య నుంచి అతను క్లీన్ చిట్‌తో బయటపడతాడని వారు ఆశిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లోనే చెన్నైలో శంకర్ పెద్దకూతురు ఐశ్వరతో రోహిత్ వివాహం జరిగింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
