ఓజి సీన్స్ ని మా సినిమా నుంచి కాపీ కొట్టారు.. ప్రముఖ దర్శకుడి వ్యాఖ్యలు వైరల్
on Oct 22, 2025

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)పవర్ ప్యాక్డ్ ప్రీవియస్ మూవీ 'ఓజి'(OG). ఈ మూవీ ముందు వరకు పవన్ చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తయితే, ఓజి ఒక్కటే ఒక ఎత్తు. అంతలా పవన్ కెరీర్ లో ఓజి ఒక స్పెషల్ మూవీగా నిలిచిపోయింది. ముఖ్యంగా పవన్ కనపడిన ప్రతి సీన్ కి థియేటర్స్ లో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల నుంచి ఒకటే విజిల్స్. అందుకే పవన్ కెరీర్ లో 300 కోట్ల రూపాయిల క్లబ్ లో చేరిన ఫస్ట్ మూవీగా కూడా నిలిచింది.
రీసెంట్ గా ఓజి గురించి ప్రముఖ కన్నడ దర్శకుడు 'ఆర్ చంద్రు'(R Chandru)మాట్లాడుతు నేను రియల్ స్టార్ ఉపేంద్రతో ‘కబ్జా'(Kabzaa)అనే చిత్రాన్ని తెరకెక్కించాను. పవన్ కళ్యాణ్ 'ఓజి' ని కబ్జా నుంచి స్పూర్తి పొందే రూపొందించారు. ఇది నిజం. మూవీలోని చాలా సన్నివేశాలు నా సినిమాని పోలి ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక పవన్ ఫ్యాన్స్ ఆర్ చంద్రు మాటలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు కబ్జాలో అసలు కథే ఉండదు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా వచ్చి కన్నడతో పాటు మిగతా అన్ని భాషల్లోను ఫ్లాప్ అయ్యింది. అసలు ఆ మూవీ వచ్చిన సంగతి కూడా ఎవరికి తెలియదు. అలాంటి మూవీని ఓజి తో పోల్చడం అర్ధరహితం అంటు ట్వీట్స్ చేస్తున్నారు.
కబ్జా విషయానికి వస్తే 2023 మార్చి 17 న పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదలైంది. ఎయిర్ ఫోర్స్ పైలట్ అయిన ఉపేంద్ర గ్యాంగ్ స్టర్ గా ఎందుకు టర్న్ అయ్యాడనే పాయింట్ తో తెరకెక్కింది. కిచ్చా సుదీప్ కథకి కీలకమైన ముఖ్య పాత్ర పోషించాడు. మరో స్టార్ హీరో శివరాజ్ కుమార్ అతిధి పాత్రలో కనిపించడం విశేషం. సుమారు 120 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కి 34 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక ఆర్ చంద్రు 2008 లో తాజ్ మహల్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకు సుమారు పన్నెండు చిత్రాల వరకు తెరకెక్కించాడు. కబ్జా తర్వాత మళ్ళీ కొత్త చిత్రం గురించి ఎలాంటి ప్రకటన రాలేదు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



