థామా ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. కెరీర్ లోనే తొలి హయ్యస్ట్ మూవీ
on Oct 22, 2025

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna)'దివాలి'(Diwali)కానుకగా 'ఆయుష్మాన్ ఖురానా'(Ayushmann Khurrana)తో కలిసి వరల్డ్ వైడ్ గా నిన్న 'థామా'(Thamma)తో అడుగుపెట్టింది. రొమాంటిక్ కామెడీ హర్రర్ గా తెరకెక్కిన 'థామా' తెలుగు లాంగ్వేజ్ లోకి కూడా డబ్ అయ్యి ఎక్కువ థియేటర్స్ లోనే విడుదలయ్యింది. రివ్యూస్ కూడా పర్లేదనే స్థాయిలోనే వస్తున్నాయి.
ఇక 'థామా' మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 25 .11 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ మేరకు చిత్ర బృందం అధికారకంగా ప్రకటిస్తు ఒక పోస్టర్ ని రిలీజ్ చేయడంతో పాటు, తొలి రోజు 25 .11 కోట్లు రావడం అనేది మా చిత్రం ఘన విజయం సాధించిందనడానికి ఉదాహరణ. ఇది బాక్స్ ఆఫీస్ ధమాకా.పైగా ఆయుష్మాన్ కెరీర్ లోనే తొలి రోజు హయ్యస్ట్ కలెక్షన్ సాధించిన చిత్రంగా నిలిచిందని కూడా సదరు సంస్థ పేర్కొంది. 'థామా'తో సిల్వర్ స్క్రీన్ పై సరికొత్త వండర్ ప్రత్యక్షమైందనే అభిప్రాయాన్నిఅయితే చాలా మంది ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.
ఇక రష్మిక బేతాళ జాతికి చెందిన 'తాడఖ' అనే క్యారక్టర్ లో కనిపించింది. మరణం లేని యువతీతో పాటు జంతువుల రక్తం తాగుతుండే సదరు క్యారక్టర్ కి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది '. 'తాడఖ' ని ప్రేమించే అలోక్ అనే జర్నలిస్ట్ క్యారక్టర్ ని ఆయుష్మాన్ ఖురానా పోషించాడు. కానీ ఆ తర్వాత రష్మిక లాగే బేతాళ జాతిలోకి మారతాడు. ఇలా ఊహకందని కథాంశాలతో 'థామా' తెరకెక్కింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేష్ రావెల్ వంటి లెజండ్రీ యాక్టర్స్ కీలక పాత్రల్లో కనిపించారు. 'చావా' ని నిర్మించిన మడాక్ ఫిల్మ్స్ అధినేత దినేష్ విజయన్(DInesh Vijayan)ప్రొడక్షన్ వాల్యూస్ తో పాటు ఆదిత్య సర్పోట్దర్(Aditya Sarpotdar)దర్శకత్వానికి ప్రేక్షకుల నుంచి మంచి పేరు వస్తుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



