గుణశేఖర్ కుమార్తె నీలిమ నిశ్చితార్ధం
on Oct 8, 2022

దర్శకుడు గుణశేఖర్ కుమార్తె నీలిమ త్వరలో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఆమె నిశ్చితార్ధం రవి ప్రఖ్యాతో జరిగింది. హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాలులో ఈ ఎంగేజ్‌మెంట్ వేడుక జరిగింది. ఈ వేడుకకు ఇరువురి కుటుంబసభ్యులు, కొంతమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ రోజు తన కాబోయే భర్తతో కలిసున్న ఫొటోను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన నీలిమ, "the beginning of forever #RaviPrakhya #NeelimaGuna " అని ట్వీట్ చేశారు.
తండ్రి గుణశేఖర్ పేరు పొందిన దర్శకుడు కావడంతో, చిన్నతనం నుంచీ ఆయనను చూస్తూ పెరిగిన నీలిమ, సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. గుణశేఖర్ మునుపటి సినిమా 'రుద్రమదేవి'కి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు గుణశేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'శాకుంతలం'కు ఆమే నిర్మాత. గుణా టీమ్ వర్క్స్ బ్యానర్‌పై ఆ చిత్రాన్ని ఆమె నిర్మిస్తున్నారు. శకుంతలగా సమంత నటిస్తోన్న ఈ మూవీలో దుష్యంతునిగా మలయాళం నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



