ఎన్టీఆర్... అట్లీ... సినిమా కన్ఫర్మ్
on Oct 24, 2019
తమిళ దర్శకుడు అట్లీతో ఎన్టీఆర్ సినిమా చేయడం కన్ఫర్మ్. దర్శకుడిగా తొలి సినిమా 'రాజా రాణీ' నుండి శుక్రవారం విడుదల కానున్న 'విజిల్' వరకూ, అట్లీ మొత్తం నాలుగు సినిమాలు చేశాడు. మొదటి సినిమాలో ఆర్య హీరో అయితే... మిగతా మూడు సినిమాల్లో విజయ్ హీరో. నాలుగు సినిమాలూ తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. అట్లీ సినిమాల్లో కథ కొత్తగా ఉండదు. కానీ, కమర్షియల్ మీటర్లో సినిమాను తీస్తాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు అదే నచ్చి ఉంటుంది. అందుకే, అతడితో సినిమా చేయాలని అనుకుంటున్నాడేమో. ప్రతిసారీ అట్లీకి ఫోన్ చేస్తున్నాడేమో. "నా సినిమా విడుదలైన ప్రతిసారీ ఎన్టీఆర్ నుండి ఫోన్ వస్తుంది. నాకు కాంప్లిమెంట్స్ ఇస్తారు. ఆయన నాపై చూపించే ప్రేమ కోసమైనా తెలుగులో సినిమా చేయాలనుకుంటున్నా" అని అట్లీ అన్నాడు. త్వరలో తెలుగు సినిమా చేస్తానని, తెలుగు సినిమాకు దర్శకత్వం వహించడం ఎప్పటి నుండో తన కల అని ఆయన అన్నాడు. ఎన్టీఆర్ తో సినిమా చేసే విషయమై హింట్ ఇచ్చాడు.