హీరోగా పరిచయమవుతున్న కీరవాణి కొడుకు
on Oct 23, 2019

ఒకే సినిమాతో ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి చిన్నకొడుకు శ్రీసింహా హీరోగా పరిచయమవుతుండగా, ఆయన పెద్దకొడుకు కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. ఆ సినిమా పేరు 'మత్తు వదలరా'. ఆ మూవీ ఫస్ట్‌లుక్‌ను జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ పేజీ ద్వారా బుధవారం విడుదల చేశారు. "కాలం వేగంగా పరిగెడుతోంది. నా తమ్ముళ్లు చాలా పెద్దవాళ్లైపోయారు" అంటూ హీరోగా పరిచయం అవుతున్న శ్రీసింహాకు, సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న కాలభైరవకు జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
'మత్తు వదలరా' చిత్ర ఫస్ట్ లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ ఫస్ట్ లుక్‌లో హైలెట్ చేసినవి చూస్తుంటే ఈ చిత్రం మంచి సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నట్లుగా తెలుస్తుంది. అందరూ కొత్తవాళ్లతో రూపొందుతున్న హీరో, మ్యూజిక్ డైరెక్టర్లతో పాటు డైరెక్టర్‌గా రితేష్ రాణా, సినిమాటోగ్రాఫర్‌గా సురేష్ సారంగం, స్టంట్ కో-ఆర్డినేటర్‌గా శంకర్, నటులుగా నరేష్ అగస్త్య, అతుల్య చంద్ర పరిచయమవుతున్నారు. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
.jpeg)
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలలో ఒకరైన చిరంజీవి (చెర్రీ) మాట్లాడుతూ.. "మత్తు వదలరా చిత్రం హాస్యంతో నిండిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. దర్శకుడు రితేష్ రాణా చివరి వరకు ఆసక్తికరమైన కథనంతో సాగే మంచి కథను తయారుచేశారు. కంటెంట్ అద్భుతంగా ఉంది కాబట్టి, అలాగే యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించాలనే ఉద్ధేశ్యంతో మేమే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ చిత్రంతో కొత్తవారినెందరినో టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నాం. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తాం" అన్నారు.
శ్రీసింహా, నరేష్ అగస్త్య, అతుల్య చంద్ర, సత్య, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తారాగణం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



