దర్శకురాలిగా రాధికా ఆప్టే
on Oct 24, 2019
.jpg)
నందమూరి నటసింహం బాలకృష్ణ సరసన 'లెజెండ్', 'లయన్' సినిమాల్లో నటించింది రాధికా ఆప్టే. అంతకు ముందు రామ్ గోపాల్ వర్మ 'రక్త చరిత్ర', ప్రకాష్ రాజ్ 'ధోని' సినిమాల్లోనూ నటించింది. కాకపోతే, బైలింగ్వల్ సినిమాలు అవి. 'లయన్' తరవాత తెలుగులో సినిమాలేవీ చేయకున్నా... కాంట్రవర్షియల్ కామెంట్స్, హాట్ హాట్ సినిమాలతో వార్తల్లో ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడీ హీరోయిన్ కొత్త అవతారం ఎత్తింది. దర్శకురాలిగా మారింది. రాధికా ఆప్టే తొలిసారి మెగాఫోన్ పట్టిన సినిమా 'స్లీప్ వాకర్స్'. వాతావరణంలో మార్పులను ప్రస్తావిస్తూ తీసిన ఈ సినిమా సమాజాన్ని ప్రశ్నించే విధంగా ఉంటుందట. ఆల్రెడీ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. సడన్ గా డైరెక్టర్ అయ్యానని రాధికా ఆప్టే చెబుతోంది. డైరెక్షన్ చేసే క్రమంలో చాలా నేర్చుకుందట. సినిమా చూసి చూసి ప్రేక్షకులు ఏం చెప్పినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని రాధికా ఆప్టే తెలిపింది. ఈ సినిమా హిట్ అయితే దర్శకురాలిగా మరిన్ని సినిమాలు చేసే ఆలోచనలో ఉందీ హీరోయిన్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



