'వాల్తేరు వీరయ్య'.. మెగా మాస్ ట్రీట్ లోడింగ్!
on Jan 10, 2023

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న 'వాల్తేరు వీరయ్య' నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తోంది. టీజర్, ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన నాలుగు పాటలు విశేష ఆదరణ పొందాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి ఐదో పాట రాబోతోంది.
'వాల్తేరు వీరయ్య' నుంచి 'నీకేమో అందమెక్కువ' అంటూ సాగే ఐదో పాటను రేపు(జనవరి 11) ఉదయం 10:35 కి విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ ఒక పోస్టర్ ని వదిలారు. లుంగీ ధరించి పక్కా మాస్ గెటప్ లో ఉన్న మెగాస్టార్.. చేతిలో ఫ్లవర్ పట్టుకొని.. శృతి హాసన్ వెంటపడుతూ పాట పాడుతున్నట్లుగా ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. పోస్టర్ ని బట్టి ఈ సాంగ్ మెగా మాస్ ట్రీట్ లా ఉండబోతుందని అర్థమవుతోంది. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో జరగనుంది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో సందడి చేయనున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



