మెగా క్లాష్.. జైలర్ వర్సెస్ ఇండియన్2!
on Feb 5, 2023
ఈ మధ్య బాక్సాఫీస్ దగ్గర స్టార్ హీరోల చిత్రాల క్లాష్ గురించి వింటూనే ఉన్నాం. అయితే ఇప్పటిదాకా విన్నదంతా ఓ ఎత్తు, ఇప్పుడు వినబోయేది మరో ఎత్తు అంటున్నారు తమిళ తంబిలు. 2023 హిస్టరీని తిరగరాస్తుందంటున్నారు ట్రేడ్ పండిట్స్. ఈ ఏడాది రజనీకాంత్ నటిస్తున్న జైలర్, కమల్‌హాసన్ నటిస్తున్న ఇండియన్2 ఒకే రోజు థియేటర్లలో సందడి చేయబోతున్నాయన్నది న్యూస్.
నెల్సన్ డైరక్షన్‌లో జైలర్‌లో నటిస్తున్నారు రజనీకాంత్. మలయాళం నుంచి మమ్ముట్టి, నార్త్ నుంచి జాకీ ష్రాఫ్, కన్నడ నుంచి శివరాజ్‌కుమార్, తమిళ్ నుంచి శివకార్తికేయన్ ఈ సినిమాలో నటిస్తున్నారు. పెద్ద మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. మరో వైపు పాతికేళ్ల తర్వాత సీక్వెల్‌గా తెరకెక్కుతోంది ఇండియన్2. కమల్‌హాసన్‌తో పాటు రకుల్‌ప్రీత్‌సింగ్, సిద్ధార్థ్, కాజల్ నటిస్తున్నారు.
ఈ రెండు సినిమాలను దీపావళి కానుకగా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నదే నిర్మాతల ప్లాన్ అట. కమల్‌హాసన్, రజనీకాంత్ బాక్సాఫీస్ దగ్గర క్లాష్ కావడం ఇదేం ఫస్ట్ టైమ్ కాదు. 2005లోనూ వీరిద్దరి సినిమాలు వచ్చాయి. హారర్ కామెడీ డ్రామా చంద్రముఖితో రజనీకాంత్ స్క్రీన్ మీదకు వస్తే, కమల్‌హాసన్ బ్లాక్ కామెడీ ముంబై ఎక్స్ ప్రెస్‌తో ఢీ కొట్టారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
