తమన్ తో `దిల్` రాజు బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్!
on Jul 15, 2022
.webp)
స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజుకి అచ్చొచ్చిన సంగీత దర్శకుల్లో యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఒకరు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాల్లో `బృందావనం` (2010), `వకీల్ సాబ్` (2021) విజయపథంలో పయనించాయి. కట్ చేస్తే.. ఇప్పుడు `దిల్` రాజు బేనర్ నుంచి రానున్న మూడు బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్ కి తమన్ స్వరాలు సమకూర్చుతున్నారు.
ఆ వివరాల్లోకి వెళితే.. `జోష్` (2009) తరువాత యువ సామ్రాట్ నాగచైతన్యతో రాజు నిర్మించిన చిత్రం `థాంక్ యూ`. వెర్సటైల్ కెప్టెన్ విక్రమ్ కె. కుమార్ రూపొందించిన ఈ సినిమా.. జూలై 22న విడుదల కానుంది. మరోవైపు.. కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ - దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న బైలింగ్వల్ మూవీ `వారసుడు` (తమిళంలో `వారిసు`) 2022 సంక్రాంతి స్పెషల్ గా తెరపైకి రానుంది. అలాగే, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ - ఇండియా ప్రాజెక్ట్ 2023 వేసవిలో జనం ముందుకు రానుంది. మరి.. తమన్ తో `దిల్` రాజు చేస్తున్న ఈ బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్ ఏ స్థాయిలో ఆదరణ పొందుతాయో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



