'మహావీరుడు'గా శివ కార్తికేయన్.. మహేష్ బెస్ట్ విషెస్
on Jul 15, 2022

కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తెలుగు మార్కెట్ పై దృష్టి పెడుతున్నాడు. ఇప్పటికే 'రెమో', 'వరుణ్ డాక్టర్', 'డాన్' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శివ కార్తికేయన్.. ప్రస్తుతం 'జాతిరత్నాలు' ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వంలో 'ప్రిన్స్' అనే బైలింగ్వెల్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మరో కొత్త సినిమాని కూడా తెలుగులో విడుదల చేయడానికి భారీ ప్లాన్ చేస్తున్నాడు. దీనికోసం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని రంగంలోకి దింపడం విశేషం.
'మండేలా' సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మడోన్నే అశ్విన్ డైరెక్షన్ లో శివ కార్తికేయన్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి తమిళ్ లో 'మావీరన్', తెలుగులో 'మహావీరుడు' అనే టైటిల్స్ ను ఖరారు చేశారు. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోను తాజాగా మహేష్ విడుదల చేశాడు. ఈ సందర్భంగా మూవీ టీమ్ కి బెస్ట్ విషెస్ చెప్పాడు. పేరుకి టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో అయినప్పటికీ టీజర్ రేంజ్ లో ఉంది. ఆ వీడియోలో కొందరు శివ కార్తికేయన్ ని కొట్టి, తాళ్లతో బందించగా.. వాళ్ళతో అతను ఫైట్ చేసిన విధానం ఆకట్టుకుంది. భరత్ శంకర్ మ్యూజిక్ వీడియోకి ప్రధాన బలంగా నిలిచింది.

శాంతి టాకీస్ బ్యానర్ పై అరుణ్ విశ్వ నిర్మిస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా భరత్ శంకర్, సినిమాటోగ్రాఫర్ గా విధు అయ్యన్న, ఎడిటర్ గా ఫిలోమిన్ రాజ్ వ్యవహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



