బన్నీ సోదరుడు యాక్సిడెంట్ లో చనిపోయాడని తెలుసా?
on Nov 9, 2022

అల్లు అరవింద్ కుమారులు అనగానే అల్లు అర్జున్, అల్లు శిరీష్ పేర్లు మొదటగా గురుకొస్తాయి. చాలా మందికి ఆయన పెద్ద కుమారుడు అల్లు వెంకటేష్(బాబీ) గురించి కూడా తెలుసు. దీంతో అల్లు అరవింద్ కి ముగ్గురు కుమారులేనని అనుకుంటారంతా. కానీ నిజానికి అరవింద్ కి నలుగురు సంతానం. ఒక కుమారుడు యాక్సిడెంట్ లో మరణించాడు. ఈ విషయాన్ని తాజాగా శిరీష్ రివీల్ చేశాడు.
శిరీష్ హీరోగా నటించిన 'ఊర్వశివో రాక్షసివో' సినిమా తాజాగా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న శిరీష్.. సినిమా గురించి, పర్సనల్ లైఫ్ గురించి పలు విషయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలో హోస్ట్ ఆలీ ఒక ఎమోషనల్ ప్రశ్న అడిగాడు. "అల్లు అరవింద్ గారిని ఈ ప్రశ్న అడుగుదామనుకున్నా. కానీ ఆయన ఎమోషనల్ అవుతారని అడగలేదు. అందుకే నిన్ను అడుగుతున్నా.. మీ నాన్నగారికి సంతానం ఎంతమంది?" అని ఆలీ అడగగా.. "మొత్తం నలుగురం. పెద్ద అన్నయ్య వెంకటేష్, రెండో అన్నయ్య రాజేష్, అర్జున్, నేను. అయితే రాజేష్ అన్నయ్య నేను పుట్టకముందే యాక్సిడెంట్ లో చనిపోయారు" అని శిరీష్ చెప్పాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



