ధైర్యంగా చెప్తున్నా.. తబస్సమ్ కు డివోర్స్ ఐపోయింది, మా ఇంట్లోనే ఉంటుంది!
on Nov 9, 2022

అటు బుల్లితెర మీద, ఇటు సిల్వర్ స్క్రీన్ మీద నటి సన ఎంతో పాపులర్. అలాంటి సన తన కూతురు తబస్సుమ్ కి కొంతకాలం క్రితం అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. కానీ తర్వాత తబస్సుమ్ తను భర్త పెట్టే టార్చర్ భరించలేక డివోర్స్ తీసుకుంది. ఈ విషయం గురించి తబుస్సమ్ తన ఛానల్ లో తల్లి సన చెప్పిన మాటలని ఒక వీడియో పోస్ట్ చేసింది.
"మంచి ఫ్యామిలీ అని పెళ్లి చేసాం. కానీ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ డబ్బు కోసం పెళ్లి చేసుకున్నారన్న విషయం తర్వాత తెలిసింది. చూపించింది ఒక ఇల్లు, అమ్మాయిని తీసుకెళ్లి పెట్టింది మరో ఇంట్లో. తర్వాత ఆస్ట్రేలియా తీసుకెళ్లాడు. మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. కానీ అమ్మాయికి తిండి పెట్టేవాడు కాదు. కష్టాలు పెట్టేవాడు. అబ్బాయి మంచోడే కానీ వాళ్ళ అమ్మకు ఇతను దత్తత కొడుకు.. అలాగే వాళ్ళ ఇంట్లో ఒక డివోర్స్ ఐన అమ్మాయి ఉండేది. ఇంత మంది కలిసి తబస్సమ్ తో మెంటల్ గేమ్ ఆడేశారు. ఐనా మాకు ఎప్పుడూ చెప్పలేదు. మమ్మల్ని ఎన్ని సార్లు అడిగితే అన్ని సార్లు కూడా డబ్బులు అన్నీ పంపేవాళ్ళం." అని చెప్పారు సన.
"అమ్మాయి ప్రెగ్నంట్ అయ్యాక నేనే ఆస్ట్రేలియా తీసుకెళ్లి వాళ్ళ అత్తగారి దగ్గర వదిలిపెట్టి వచ్చాను. మేం ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా ఉండేవారు. వాళ్ళ టార్చర్ భరించలేక అమ్మాయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను తెలుసుకున్నా, తబుస్సమ్ చాలా అవస్థలు పడుతోందని. దాంతో నేను మా అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేసాను. వాళ్ళను పిలిచాం మాట్లాడడానికి. కానివాళ్ళు అప్పటికే తప్పించుకుని తిరుగుతున్నారు. తర్వాత మనవడు ప్రిన్స్ పుట్టాడు." అని తెలిపారు.
"ఇప్పటికే అతన్ని మూడుసార్లు జైలుకి పంపించాం.. ఇస్లామిక్ చట్టం ప్రకారం డివోర్స్ ఐపోయింది. ఐతే అందరూ అడుగుతున్నారు అమ్మాయికి ఏమయ్యింది అని.. నేను ధైర్యంగా చెప్తున్నా... డివోర్స్ ఐపోయింది, మా ఇంట్లోనే ఉంటుంది అని. దాంట్లో సిగ్గు పడాల్సింది ఏమీ లేదు కదా.." అని తన కూతురు గురించి ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు సన.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



