షారుక్‌తో చేయడానికి సామ్ కాదంటే, నయన్ ఔననిలే!
on Oct 19, 2021

సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో చేస్తున్న 'పఠాన్' మూవీ తర్వాత, బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ తమిళ డైరెక్టర్ అట్లీతో 'లయన్' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. పోయిన నెలలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లింది. ఈ మూవీలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రియమణి, సాన్యా మల్హోత్రా, యోగిబాబు, సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రివెంజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోందని టాక్.
తమకు చెందిన ఒక అమూల్యమైన సంపదను దోచుకెళ్లిన వారిపై పగ తీర్చుకోవాలనే అమ్మాయిలుగా నయనతార, ప్రియమణి, సాన్యా మల్హోత్రా నటిస్తుండగా, వారికి అండగా నిలిచి, ఆ పనిచేసే వ్యక్తిగా షారుక్ నటిస్తున్నాడని వినిపిస్తోంది.
ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన అంశం ప్రచారంలోకి వచ్చింది. హీరోయిన్‌గా ఈ మూవీకి అట్లీ ఫస్ట్ చాయిస్ నయనతార కాదు, సమంత! మొదట ఈ రోల్‌కు సమంతను సంప్రదించగా, ఆమె రిజెక్ట్ చేసిందనీ, దాంతో నయనతారను అట్లీ సంప్రదించాడనీ ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. 'లయన్' మూవీకి ఎ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించే అవకాశాలు ఉన్నాయి. ఇదివరకు షారుక్, రెహమాన్ కాంబినేషన్‌లో 'దిల్ సే', 'జబ్ తక్ హై జాన్' సినిమాలు వచ్చాయి.
సందర్భవశాత్తూ నయనతార, సమంత కలిసి 'కాదు వాకుల రెండు కాదల్' అనే తమిళ్ మూవీలో కలిసి నటిస్తున్నారు. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తోన్న ఈ మూవీని విఘ్నేశ్ శివన్ డైరెక్ట్ చేస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



