సుకుమార్ 'ఆర్య-3'లో విజయ్ దేవరకొండ!
on Oct 19, 2021
అల్లు అర్జున్ హీరోగా నటించిన 'ఆర్య' సినిమాతో సుకుమార్ డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకొని బన్నీకి యూత్ లో మంచి ఫాలోయింగ్ వచ్చేలా చేశాడు. బన్నీ-సుకుమార్ కాంబినేషన్ కి ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. 'ఆర్య' తర్వాత వీరి కాంబినేషన్ లో 'ఆర్య 2' వచ్చింది. ఇది ఆర్య స్థాయి విజయాన్ని అందుకోకపోయినా ఫ్యాన్స్ ని అలరించింది. దీంతో వీరి కాంబినేషన్ లో 'ఆర్య 3' ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే బన్నీ ఫ్యాన్స్ కి ఊహించని షాక్ తగలనుంది. ఆర్య-3 లో బన్నీ నటించట్లేదని న్యూస్ వినిపిస్తోంది.
బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో ప్రస్తుతం 'పుష్ప' మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. 'పుష్ప పార్ట్ 2' తర్వాత 'ఆర్య3' చేయబోతున్నట్లు ఇటీవల లైవ్ చాట్ లో సుకుమార్ క్లారిటీ ఇచ్చారు. 'ఆర్య3' స్క్రిప్ట్ రెడీ అవుతోందని, త్వరలోనే అప్డేట్ ఇస్తామని ఆయన అన్నారు. దీంతో 'ఆర్య3' గురించి చర్చలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ బన్నీ నటించట్లేదని, విజయ్ దేవరకొండ నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది.
నిజానికి సుకుమార్ 'రంగస్థలం' తర్వాత విజయ్ తో సినిమా చేయాల్సి ఉంది. కానీ అనూహ్యంగా 'పుష్ప' పట్టాలెక్కింది. అయితే పుష్ప తర్వాత విజయ్ తో సుకుమార్ ఓ సినిమా చేయనున్నారని, అది ఆర్య3 నే అని టాక్ వినిపిస్తోంది. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలీదు కానీ.. ఒకవేళ నిజమైతే మాత్రం ఆర్యగా విజయ్ ఏ స్థాయిలో అలరిస్తాడో చూడాలి.
Also Read