రెండో రోజు కూడా 'ధమాకా' కలెక్షన్ల జోరు!
on Dec 24, 2022

మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం 'ధమాకా' మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేసిన ఈ చిత్రం డిసెంబర్ 23న విడుదలై.. మొదటి రోజు అంచనాలకు మించిన కలెక్షన్స్ రాబట్టింది. రెండో రోజు కూడా మంచి కలెక్షన్స్ తో సత్తా చాటింది.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.4.66 కోట్ల షేర్ రాబట్టిన ధమాకా.. రెండో రోజు రూ.3.53 షేర్ రాబట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రెండు రోజుల్లో రూ.8.19 కోట్ల షేర్ వసూలు చేసింది. ఏరియాల వారీగా చూస్తే.. నైజాంలో రూ.3.72 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.1.34 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.3.13 కోట్ల షేర్ సాధించింది.
ధమాకా చిత్రం రెండు రోజుల్లో.. రెస్టాఫ్ ఇండియా రూ.65 లక్షల షేర్, ఓవర్సీస్ లో రూ.60 లక్షల షేర్ కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.5.46 కోట్ల షేర్, రెండో రోజు రూ.3.98 కోట్ల షేర్ రాబట్టింది. రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.9.44 కోట్ల షేర్ సాధించింది. దాదాపు రూ.18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ న్యూ ఇయర్ నాటికి బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశముందని ట్రేడ్ వర్గాల అంచనా.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



