శర్వా-రష్మికల మూవీకి మ్యూజిక్ డైరక్టర్ గా రాక్ స్టార్
on Jul 22, 2021

శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని ఈ రోజు(గురువారం) అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.
డైరెక్టర్ కిషోర్ తిరుమల, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ లది హిట్ కాంబినేషన్. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన మొదటి మూడు సినిమాలు 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ', 'చిత్రలహరి' లకు దేవినే సంగీతం అందించారు. ఈ మూడు సినిమాల సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకున్నాయి. ఇక కిషోర్ తిరుమల నాలుగో సినిమా 'రెడ్' సినిమాకు మాత్రం మణిశర్మ సంగీతం అందించారు. అయితే ఇప్పుడు తన ఐదో సినిమా 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' కోసం మళ్ళీ దేవితోనే పనిచేయబోతున్నారు కిషోర్. మరి ఈ హిట్ కాంబినేషన్ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతోన్న 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ప్రస్తుతం శర్వానంద్, రష్మిక సహా ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



