బాలయ్యతో వెంకీ చిత్రం?
on Jul 22, 2021

`ఛలో`(2018)తో దర్శకుడిగా తొలి అడుగేశాడు వెంకీ కుడుముల. మొదటి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్.. రెండో సినిమా `భీష్మ` (2020)తోనూ విజయఢంకా మ్రోగించాడు. ఈ నేపథ్యంలో.. వెంకీ తదుపరి చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. త్వరలో ఓ అగ్ర కథానాయకుడితో తన శైలి ఎంటర్టైన్మెంట్ అందించేందుకు వెంకీ సిద్ధమవుతున్నాడట.
ఆ వివరాల్లోకి వెళితే.. నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఓ సినిమాని నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలయ్య కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కాగా, ఈ సినిమాని త్రివిక్రమ్ శిష్యుడైన వెంకీ రూపొందించనున్నాడట. అంతేకాదు.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుందని వినికిడి. కథ విన్న వెంటనే బాలయ్య ఈ ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బజ్. త్వరలోనే బాలయ్య - వెంకీ కాంబో మూవీపై క్లారిటీ రానుంది.
ఇదిలా ఉంటే.. బాలయ్య తాజా చిత్రం `అఖండ` చిత్రీకరణ తుది దశలో ఉంది. `అఖండ` తరువాత గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడితో బాలయ్య తదుపరి సినిమాలు తెరకెక్కనున్నాయి. ఆపైనే `భీష్మ` దర్శకుడి మూవీ రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



