‘SSMB 29’ సినిమాకి ఊహించని టైటిల్!
on Oct 8, 2025
.webp)
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్ లో ఓ మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ని కె.ఎల్.నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్ కి 'SSMB 29' అనేది వర్కింగ్ టైటిల్.
'SSMB 29' సినిమా కోసం Gen 63, మహారాజ, చక్రవర్తి, గరుడ వంటి టైటిల్స్ ని పరిశీలిస్తున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. ఇప్పుడు మరో టైటిల్ తెరపైకి వచ్చింది. అదే 'వారణాసి'. ఆమధ్య 'SSMB 29' సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో రూ.50 కోట్లతో వారణాసి పురాతన నగర సెట్ వేస్తున్నట్లు ప్రచారం జరిగింది. అలాంటిది ఇప్పుడు ఆ నగరం పేరే టైటిల్ గా పెడుతున్నారన్న వార్త మరింత ఆసక్తికరంగా మారింది.
'SSMB 29'ను గ్లోబల్ ఫిల్మ్ గా రూపొందిస్తున్నారు. కేవలం ఇండియన్ ప్రేక్షకుల కోసమే కాకుండా, గ్లోబల్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని టైటిల్ పెట్టాల్సి ఉంది. మరి ఈ సినిమాకి నిజంగానే 'వారణాసి' అనే టైటిల్ పెడతారా? లేక ఏదైనా ఇంగ్లీష్ టైటిల్ వైపు మొగ్గుచూపుతారా? అనేది చూడాలి.
కాగా, నవంబర్ లో 'SSMB 29' ఫస్ట్ లుక్ విడుదల కానుంది. అప్పుడే టైటిల్ పై కూడా క్లారిటీ వచ్చే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



