పెద్ది సర్ ప్రైజ్.. చరణ్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్!
on Oct 8, 2025

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'పెద్ది'. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ విశేషంగా ఆకట్టుకొని, సినిమాపై అంచనాలు పెంచేసింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అదిరిపోయే న్యూస్ వినిపిస్తోంది. (Ram Charan)
'పెద్ది' సినిమా 2026 మార్చి 27న విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ ఎడిట్ కూడా లాక్ అయినట్లు సమాచారం. ఇప్పటిదాకా వచ్చిన అవుట్ పుట్ పట్ల మూవీ టీమ్ చాలా హ్యాపీగా ఉందట. ఫస్ట్ హాఫ్ చూసి చరణ్ తో పాటు, ప్రొడ్యూసర్స్ ఇంప్రెస్ అయ్యారని వినికిడి. (Peddi)
రామ్ చరణ్ కెరీర్ లో 'రంగస్థలం' సినిమాకి ప్రత్యేక స్థానముంది. నటుడిగా గొప్ప పేరు తీసుకురావడమే కాకుండా, కమర్షియల్ గానూ భారీ సక్సెస్ సాధించింది. 'పెద్ది' సినిమా చరణ్ కెరీర్ లో మరో 'రంగస్థలం' అవుతుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది.
కాగా, 'పెద్ది'లో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, కీలక పాత్రలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



