రాష్ట్రపతిగా కృష్ణంరాజు..?
on Jan 23, 2017

సినిమాలకు దూరమై ప్రశాంతంగా గడుపుతున్న రెబల్‌స్టార్ కృష్ణంరాజుపై ఈ మధ్య కాలంలో పుకార్లు షికారు చేస్తున్నాయి. వాటిలో ఎంత నిజముందో తెలియదు కానీ ఆ వార్తలకు మాత్రం ఎక్కడా లేని ప్రాధాన్యత వచ్చేస్తుంది. రోశయ్య స్థానంలో ఖాళీ అయిన తమిళనాడు గవర్నర్ పదవికి కృష్ణంరాజును ఎంపిక చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత అది నిజం కాదని తేలింది. తాజాగా భారత రాష్ట్రపతిగా రెబల్‌స్టార్ పేరు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలున్నాయట..అయితే ఇది రియల్ లైఫ్‌లో కాదు రీల్ లైఫ్‌లో..అసలు మ్యాటరేంటంటే తన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ఘనవిజయం సాధించడంతో 101వ చిత్రంపై ఫోకస్ చేశాడు బాలయ్య.
దీనిలో భాగంగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ చెప్పిన రైతు కథ నచ్చడంతో దానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు బాలయ్య. అయితే రైతు సినిమాలోని ఓ కీలకపాత్ర అమితాబ్ చేస్తేనే బాగుంటుందని ఆయనను కోరారు బాలయ్య, కృష్ణవంశీ..కానీ తనకు డేట్స్ ఖాళీగా లేవని ఆ ఆఫర్‌ను తిరస్కరించారు బిగ్‌బి. అమితాబ్ లేకుండా సినిమా సాధ్యం కాదని ఈ ప్రాజెక్ట్‌ని పక్కనబెట్టారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రని రెబల్‌స్టార్ కృష్ణంరాజుతో చేయించి రైతును పట్టాలెక్కించాలని బాలకృష్ణ భావిస్తున్నట్లు సమాచారం..ప్రస్తుతం నక్షత్రం సినిమాని తెరకెక్కిస్తున్న కృష్ణవంశీ త్వరలో రెబల్‌స్టార్‌ని కలిసి కథ చెప్పే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్ టాక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



