'ఆచార్య'కు డైరెక్టర్ ఏం చెబితే అదే చేశాం.. కొరటాలపై చిరు కామెంట్!
on Oct 1, 2022

తండ్రీకొడుకులు చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' సినిమా అంబరాన్నంటే అంచనాల మధ్య విడుదలై, అనూహ్యమైన పరాజయాన్ని చవిచూసింది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీ టాలీవుడ్‌లోని బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో ఒకటిగా చెడ్డపేరు తెచ్చుకుంది. ఆమధ్య ఓసారి 'ఆచార్య' పరాజయం గురించి ఓ ఈవెంట్‌లో ప్రస్తావించిన చిరంజీవి, లేటెస్ట్‌గా మరోసారి ఆ సినిమా ఫలితంపై పెదవి విప్పారు. అయితే ఈసారి డైరెక్టర్ గురించి ఆయన ప్రస్తావించడంతో, అది వైరల్‌గా మారింది.
చిరంజీవి లేటెస్ట్ ఫిల్మ్ 'గాడ్‌ఫాదర్' అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఆ మూవీ ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లిన ఆయన.. అక్కడ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో 'ఆచార్య' గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా ఫ్లాపవడం తనను బాధించలేదని చెప్పారు. అయితే కొడుకు చరణ్‌తో తొలిసారి కలిసి నటించిన సినిమా హిట్ కాకపోవడమే తనకు విచారం కలిగించిందన్నారు.
"సినిమా రిజల్ట్ మన చేతుల్లో ఉండదు. మన వర్క్‌లో మనం బెస్ట్ ఇస్తాం. 'ఆచార్య' ఫ్లాపవడం నన్నేమాత్రం బాధపెట్టలేదు. ఎందుకంటే డైరెక్టర్ ఏం చెప్పాడో అదే మేం చేశాం." అని ఆయన అన్నారు. "చరణ్, నేను కలిసి మొదటిసారి సినిమా చేస్తే, అది హిట్ కాకపోవడం ఒక్కడే బాధపెట్టింది." అని చెప్పారు.
కెరీర్ మొదట్లో హిట్టొస్తే ఆనందపడేవాడిననీ, ఫ్లాపొస్తే బాధపడేవాడిననీ ఆయన అన్నారు. "ఆ రోజులు గతించిపోయాయి. మానసికంగా, శారీరకంగా హిట్లు, ఫ్లాపులను.. అన్నింటినీ ఎలా తీసుకోవాలో అర్థం చేసుకున్నాను. నటుడిగా మెచ్యూరిటీ సాధించాక ఫ్లాపులు బాధపెట్టడం మానేశాయి. అలాగే సక్సెస్‌లకు పొంగిపోలేదు కూడా" అని చెప్పుకొచ్చారు చిరంజీవి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



