జీవితాన్ని రివైన్డ్ చేసుకునే అవకాశం వస్తే ఆ తప్పులు మళ్ళీ చేయను
on Oct 14, 2022

మొదట మూవీస్ ద్వారా తర్వాత జబర్దస్త్ ద్వారా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న కమెడియన్ ధనరాజ్. ఐతే ధనరాజ్ చలాకి చంటి గురించి కొన్ని కామెంట్స్ చేసాడు. ఒక ఇంటర్వ్యూలో భాగంగా ధనరాజ్ మాట్లాడుతూ "స్కిట్స్ చేసే టైములో చాలా నెగటివ్ కామెంట్స్ వస్తాయి అది కామన్ ఎందుకంటే అందరికీ మనం నచ్చాలని , మన స్కిట్స్ నచ్చాలని లేదు కదా" అన్నాడు. "జబర్దస్త్ 13 ఎపిసోడ్ల తర్వాత అందరం బయటికి వెళ్లిపోవాలనుకున్నాం అలాగే వెళ్లిపోయాం మళ్ళీ వచ్చాం. ఐతే షూటింగ్స్ ఉన్న టైములో చలాకీ చంటి జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లిపోయేవాడు..ఐతే అక్కడ ఏదో జరిగి వెళ్ళిపోయినట్టు క్రియేట్ అయ్యేది.
షూటింగ్ లో ఏది నచ్చకపోయినా మొహం మీద చెప్పేసి వెళ్లిపోయేవాడు. తర్వాత బతిమలాడి, ఫోన్స్ చేసి మళ్ళీ వెనక్కి పిలిచేవాళ్ళం. చంటి బిగ్ బాస్ లో వెళ్ళాడు కదా అందరం ఓట్లు కూడా వేసాం. ఐతే టాప్ 4 లో రేవంత్, సుదీప, శ్రీహాన్, గీతూ రాయల్ ఉంటారనుకుంటున్నా." అని చెప్పాడు ధనరాజ్. "మీ జీవితంలో ఏదైనా రివైన్డ్ చేసుకుని మార్చుకోవాల్సి వస్తే ఏం మార్చుకుంటారు" అని అడిగేసరికి..."జీవితంలో ఏదైనా మార్చుకోగలిగే అవకాశం వస్తే సినిమా ప్రొడ్యూస్ చేసేవాడిని కాదు, సినిమాలలో హీరోగా నటించేవాడిని కాదు అలాగే మా అమ్మ 3rd స్టేజి క్యాన్సర్ తో చనిపోయారు. ఆ విషయాన్ని 1st స్టేజిలో తెలుసుకుని ఇప్పటి వరకు కాపాడుకునేవాడిని." అంటూ ఎన్నో విషయాలు చెప్పాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



