అఫీషియల్.. 'బింబిసార' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
on Oct 14, 2022
నందమూరి కళ్యాణ్ రామ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ 'బింబిసార' ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ప్రేక్షకుల ఎదురుచూపులకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. వచ్చే వారం నుంచి ఓటీటీలో అలరించడానికి 'బింబిసార' సిద్ధమవుతోంది.
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన 'బింబిసార'లో కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం పోషించాడు. ఆగస్టు 5న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే 'బింబిసార'తో పాటు విడుదలైన 'సీతా రామం', ఆ తర్వాత విడుదలైన 'కార్తికేయ-2' ఇప్పటికే ఓటీటీలలో అలరిస్తున్నాయి. కానీ 'బింబిసార' ఇంతవరకు ఓటీటీలోకి రాకపోవడంతో.. త్వరగా రిలీజ్ చేయాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓటీటీ వేదిక 'జీ5' 'బింబిసార' స్ట్రీమింగ్ గురించి అప్డేట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేసింది. అక్టోబర్ 21 నుంచి స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించింది.
ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రానికి మల్లిడి వశిష్ట్ దర్శకుడు. కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్, ప్రకాష్ రాజ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి, చిరంతన్ భట్ సంగీతం అందించారు.
Also Read