'అల్లూరి సీతారామరాజు'పై బాలయ్య క్వశ్చన్.. తప్పులో కాలేసిన మహేశ్!
on Feb 5, 2022

సూపర్‌స్టార్ కృష్ణ కీర్తి కిరీటంలో 'అల్లూరి సీతారామరాజు' ఒక కలికితురాయి. ఆ సినిమా కృష్ణను ఆకాశంమంత ఎత్తున నిలిపింది. నిజానికి సీతారామరాజు సినిమా తియ్యాలని అంతకుముందు విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు ప్రయత్నించి, ఆపేశారు. కృష్ణ తీసి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు ఆ సినిమా గురించి మహేశ్‌ను ప్రశ్నించారు నందమూరి బాలకృష్ణ. ఆహా ఓటీటీలో ప్రభంజనం సృష్టిస్తోన్న సెలబ్రిటీ టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' ఫస్ట్ సీజన్ ఫైనల్ ఎపిసోడ్‌కు గెస్ట్‌గా మహేశ్ వచ్చాడు. ఈ సందర్భంగా మహేశ్‌కు సంబంధించిన అనేక విషయాలను ఆయనతో చెప్పించారు బాలయ్య. వాటిలో కృష్ణ తీసిన 'అల్లూరి సీతారామారాజు' సినిమా ప్రస్తావన ఒకటి.
"అల్లూరి సీతారామరాజు సినిమాను నాన్నగారు తీద్దామనుకున్నారు, కానీ తర్వాత ఆ సినిమాని కృష్ణగారు తీశారు. దీంట్లో రెండున్నాయ్. ఒక అభిమానిగా నాన్నగారికి (ఎన్టీఆర్‌కు) బహుమతిగా ఇచ్చుకుంటాను అన్నట్లు తీశారా? లేకపోతే ఒక కాంపిటిషన్ అన్న ఆలోచనతో తీశారా?" అని మహేశ్‌ను ప్రశ్నించారు బాలయ్య. "యాక్చువల్‌గా అప్పుడే నేను పుట్టాననుకుంటా సార్.. అది వచ్చింది 1975లో అనుకుంటా" అని మొదలుపెట్టాడు మహేశ్. కానీ 'అల్లూరి సీతారామరాజు' వచ్చింది 1974 మే 1న. మహేశ్ పుట్టింది 1975 ఆగస్ట్ 9. ఆ సినిమా విడుదలైన ఏడాది తర్వాత మహేశ్ పుట్టాడు. ఇలా ఆ సినిమా విడుదల తేదీ విషయంలో బోల్తాపడ్డాడు మహేశ్. Also read: నీ మొగుడు ఏమన్నా మహేష్ బాబా?
"నాకు తెలిసి.. 'సీతారామరాజు' తియ్యాలనేది నాన్నగారి ప్యాషన్. గర్వంగా ఆయన హార్ట్‌లోంచి వచ్చిన ప్రాజెక్టేనండీ. మేం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆయన మాకు చెప్పిందేమిటంటే, 'రామారావుగారు ఎప్పుడో చేద్దామనుకున్నారు ఈ సినిమాని. కానీ నేను అల్లూరి సీతారామరాజు తీసి, ఆయనకు చూపించినప్పుడు, కృష్ణా చాలా బాగా చేశావయ్యా ఈ సినిమా. నేను కూడా ఇలా చేసుండకపోవచ్చేమో అన్నారంట. పిల్లలుగా అది మేం విన్నప్పుడు ఎప్పుడూ మర్చిపోలేం.' అని మహేశ్ చెప్పాడు. Also read: 'సామాన్యుడు' మూవీ రివ్యూ
"అవి రోమాలు నిక్కబొడుచుకునే మూమెంట్స్" అని బాలయ్య అనడంతో, "అవును రోమాలు నిక్కబొడుచుకొనే మూమెంట్స్. దీనివల్ల ఏమైపోయిందంటే, 'అల్లూరి సీతారామరాజు' అనేది నాకొక బైబిల్‌లాగా అయిపోయింది." అని మహేశ్ జవాబిచ్చాడు. "ఒక 'దానవీరశూర కర్ణ', ఒక 'అల్లూరి సీతారామరాజు' చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయిన బైబిల్స్" అని స్పందించారు బాలకృష్ణ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



