'పుష్ప' 50 రోజుల ప్రభంజనం.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
on Feb 4, 2022

అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప ది రైజ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 17 న విడుదలై బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించి సంచలన విజయాన్ని అందుకుంది. నేటితో ఈ మూవీ 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్స్ విడుదల చేసింది.

పుష్ప 50 రోజుల పోస్టర్స్ ను తాజాగా మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఆ పోస్టర్ లో పుష్ప ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో కలిసి రూ. 365 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లుగా ఉంది. అలాగే పుష్ప హిందీ వెర్షన్ రూ.100 కోట్ల నెట్ కలెక్ట్ చేసినట్లుగా పోస్టర్ ద్వారా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సరైన ప్రమోషన్స్ లేకుండా ఒమిక్రాన్ టైంలో పుష్ప హిందీ వెర్షన్ 100 కోట్లు కలెక్ట్ చేయడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
.webp)
తగ్గేదేలే అంటూ పుష్ప పార్ట్-1 సృష్టించిన సంచలనంతో పుష్ప పార్ట్-2 (పుష్ప ది రూల్)పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



