వన్స్ మోర్.. కో-బ్రదర్స్ వర్సెస్ మెగాపవర్ స్టార్!
on Feb 3, 2022
.webp)
``అంతేగా.. అంతేగా..`` అంటూ 2019 సంక్రాంతికి కో-బ్రదర్స్ గా పసందైన వినోదాలు పంచి సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నారు విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. కట్ చేస్తే.. మూడేళ్ళ తరువాత ఈ వేసవికి మరోసారి ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యారు. `ఎఫ్ 2` (2019) సీక్వెల్ గా రూపొందుతున్న `ఎఫ్ 3`తో సమ్మర్ సోగ్గాళ్ళుగా హాస్యవిందు అందించబోతున్నారు వెంకీ, వరుణ్. ఏప్రిల్ 28న ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ జనం ముందుకు రానుంది.
కాగా, ఈ సినిమా విడుదలైన తరువాతి రోజే అంటే ఏప్రిల్ 29న `ఆచార్య` రాబోతోంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించారు. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. `ఎఫ్ 2`కి పోటీగా కూడా అప్పట్లో చరణ్ నటించిన సినిమా ఒక రోజు ముందు విడుదలైంది. ఆ చిత్రమే.. `వినయ విధేయ రామ`. 2019 జనవరి 12న `ఎఫ్ 2` రిలీజ్ కాగా, జనవరి 11న `వినయ విధేయ రామ` విడుదలైంది.
Also Read: కొత్త రిలీజ్ డేట్స్.. కొంచెం క్లారిటీ, కొంచెం కన్ఫ్యూజన్!
కట్ చేస్తే.. ఇప్పుడు `ఎఫ్ 2` సీక్వెల్ `ఎఫ్ 3` విషయంలో కూడా చరణ్ నటించిన సినిమానే ఒక రోజు తరువాత రిలీజ్ కానుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మొత్తమ్మీద.. `ఎఫ్ 2`, `ఎఫ్ 3`.. ఇలా కో-బ్రదర్స్ సందడికి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రూపంలో పోటీ ఎదురవడం యాదృచ్ఛికమే అయినా వార్తల్లో నిలిచే అంశమనే చెప్పాలి. మరి.. ఈ సారి కూడా పోటీ తప్పదా? లేదంటే చివరి నిమిషంలో ఏదో ఒక సినిమా వాయిదా పడుతుందా? అన్నది చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



