పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన అల్లు అర్జున్!
on Feb 3, 2022

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గతేడాది అక్టోబర్ 29 న గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. పునీత్ తో టాలీవుడ్ హీరోలకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన మృతి పట్ల టాలీవుడ్ మొత్తం విచారం వ్యక్తం చేసింది. ఎందరో టాలీవుడ్ స్టార్స్ పునీత్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మరికొందరు స్టార్స్ తరువాత బెంగళూరుకు వెళ్లి పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు.
గురువారం బెంగుళూరులోని పునీత్ ఇంటికి వెళ్లిన బన్నీ.. పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పునీత్ సోదరుడు కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ తో ముచ్చటించిన బన్నీ పునీత్ మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం బన్నీ.. పునీత్ సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు.

కాగా పునీత్ నటించిన చివరి సినిమా 'జేమ్స్' సినిమా మార్చి 17న థియేటర్లోకి రాబోతోంది. పునీత్ నివాళిగా మార్చి 17 నుంచి 24 వరకు వారంరోజుల పాటు మరే ఇతర సినిమాని విడుదల చేయకూడదని కన్నడ పరిశ్రమ నిర్ణయం తీసుకుంది. ఆ వారం రోజులు కర్ణాటక థియేటర్స్ లో పునీత్ జేమ్స్ సినిమా మాత్రమే ప్రదర్శించబడుతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



