కోర్టు మెట్లెక్కుతున్న అక్కినేని అమల...
on Aug 21, 2016

అక్కినేని అమల గత కొన్ని ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూనే వచ్చారు. అయితే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినా.. ఆతరువాత కూడా ఇంకా ఏ సినిమాల్లో నటించలేదు. అయితే ఇప్పుడు ఆమె మలయాళ సినీ పరిశ్రమలో అడుగుపెడుతున్నారు. అది కూడా తన ఫ్రెండ్ కోసం. ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్, అమల మంచి ఫ్రెండ్స్. ఆంటోనీ సోనీ సారధ్యంలో డెబ్యూ మూవీగా వస్తున్న చిత్రం 'కేరాఫ్ సైరాబాను' అనే చిత్రంలో మంజు వారియర్ లీడ్ రోల్ చేస్తున్నారు. ఇదే సినిమాలో ఆనీ జాన్ అనే న్యాయవాది పాత్రలో అమలా కనిపించనుంది. కాగా ఇప్పటికే స్క్రిప్టు, ప్రీపొడక్ష పనులన్నీ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. తన స్నేహితురాలు మంజు వారియర్ కోసమే ఆమె ఈ సినిమా కమిటైందని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



