చిరుకు సునీల్ షాక్ ఇచ్చాడా..?
on May 27, 2016

మెగా స్టార్ 150 అంటే ప్రేస్టేజియస్ మూవీ. ఈ సినిమాలో ఒక్క ఛాన్స్ వస్తే చాలని చాలా మంది కోరుకుంటారు. అయితే సునీల్ కు మాత్రం ఈ లిస్ట్ లో లేడు. స్వయంగా వినాయక్ ఈ మూవీలో సునీల్ ను చేయమని అడిగినా సునీల్ కాదన్నాడని ఫిలిం నగర్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. సునీల్ కు ఆల్రెడీ ఉన్న కమిట్ మెంట్సే ఇందుకు కారణమట. తన ప్రొడ్యూసర్ల కు ఇచ్చిన డేట్స్ తో క్లాష్ వస్తుండటంతో చిరు ల్యాండ్ మార్క్ సినిమాను వదులుకోక తప్పలేదట. చిరు తనకు ఆదర్శం అని చెప్పే సునీల్, ఆయనలాగే స్వయంకృషితో ఇండస్ట్రీలో పైకొచ్చాడు. ఒకప్పుడు ఆయనతో ఫోటో దిగితే చాలనుకున్నవాడు కాస్తా ఆయనతో అనేక సినిమాల్లో నటించాడు. అయితే, చిరు ల్యాండ్ మార్క్ సినిమా, అది కూడా రీఎంట్రీ ఇస్తున్న సినిమాలో అవకాశం మిస్ అవడం పట్ల సునీల్ ఫీలవుతున్నాడట. సునీల్ స్థానంలో వెన్నెల కిషోర్ కు ఆ అవకాశం దక్కిందని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



