నాలుగు రాష్ట్రాల్లో జనతా గ్యారేజ్ రిలీజ్..!
on May 27, 2016
.jpg)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం చెన్నైలో యాక్షన్ సీక్వెన్స్ లు తెరకెక్కిస్తున్నారు మూవీ టీం. ఈ సినిమాతో తన మార్కెట్ ను సౌత్ ఇండియా అంతా పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు యంగ్ టైగర్. సినిమాలో అనేక రకాల భాషల నటీనటులుండటంతో, ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలనకుంటున్నాడు. తెలుగుతో పాటే ఒకేసారి కేరళలో కూడా భారీ సంఖ్యలో థియేటర్లలో సినిమాను రిలీజ్ చేసి అక్కడ విజయకేతనం ఎగరేయాలనేది తారక్ ప్లాన్. సమంతతో పాటు, సినిమాలో తమిళ నటులు చాలామందే ఉన్న కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ తమిళంలోనూ కూడా విడుదల ఉండేలా చూద్దామనుకుంటున్నారట. పైగా సినిమా చాలా వరకూ చెన్నైలో జరుగుతుంది కాబట్టి, అది కూడా మూవీకి తమిళనాట మంచి ప్లస్ అవుతుందని ఎన్టీఆర్ భావిస్తున్నాడు. దీంతో ఆంధ్రా, తెలంగాణా, కేరళ, తమిళనాడుల్లో తన సినిమాను రిలీజ్ చేసి మార్కెట్ రేంజ్ ను భారీగా పెంచుతున్నాడు జూనియర్. ఇండియాలోనే కాకుండా జపాన్ లో కూడా ఎన్టీఆర్ కు హెవీ ఫాలోయింగ్ ఉంది. మన దగ్గర యావరేజ్ గా ఆడిన జూనియర్ సినిమాలు, జపాన్ లో సూపర్ హిట్టయ్యాయి. భారతీయ నటుల్లో రజనీ తర్వాత జపాన్ ప్రజలను ఆకట్టుకున్న హీరో ఎన్టీఆరే కావడం విశేషం. మరి తారక్ ఏం చేయబోతున్నాడో తెలియాలంటే ఆగష్ట్ 12 వరకూ వేచి చూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



