బాయ్ ఫ్రెండ్ గురించి క్లారిటీ ఇచ్చేసిన ఇలియానా..!
on May 27, 2016

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి మకాం పెట్టిన తర్వాత పూర్తిగా దెబ్బైపోయింది గోవా బేబీ ఇలియానా కెరీర్. ఇక్కడే ఉంటే ఏదొక అవకాశం తలుపు తట్టేదేమో కానీ, హిందీ పరిశ్రమ మోజులో ముంబైకు మకాం మార్చేసి రాంగ్ స్టెప్పేసింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ తో నటించిన రుస్తుం తప్ప ఈవిడ చేతిలో సినిమాలు లేదు. అయితే సినిమాలు లేకపోయినా ఈ నడుము సుందరి ఖాళీగా లేదండోయ్. ఆస్ట్రేలియా కు చెందిన తన ఫోటోగ్రఫర్ బాయ్ ఫ్రెండ్ తో లైఫ్ ను ఎంజాచ్ చేస్తోంది. ఇన్నాళ్లూ ఈ విషయాన్ని దాచి ఉంచింది. అందరికీ తెలిసిన విషయమే అయినా, బాయ్ ఫ్రెండ్ గురించి ఒప్పుకోవడానికి సంకోచించింది. అయితే ఏమనిపించిందో ఏమో గానీ, లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఒప్పేసుకుంది. అయితే అతని పేరు మాత్రం చెప్పలేదు. మీ అందరికి తెలిసింది నిజమే. నాకు అతనికి మధ్య అనుబంధం ఉంది. కానీ ఆ అతను ఎవరో మాత్రం నేను చెప్పను. ఒక రిలేషన్ షిప్ లో ఇద్దరి వైపునా అంగీకారం ఉంటేనే బయటికి చెప్పగలం. ఇది పర్సనల్ లైఫ్ కు సంబంధించింది కాబట్టి, పూర్తిగా నేనేమీ మాట్లాడదలుచుకోలేదు అంటూ చెప్పీ చెప్పనట్టుగా ఆన్సర్ ఇచ్చింది. ఆ నువ్వు చెప్పకపోతే మాకు తెల్దేంటి అంటున్నారు బాలీవుడ్ జనాలు. త్వరలోనే ఇల్లీ బేబీ పెళ్లి బాజాలు మోగితే ఆశ్చర్యం లేదండోయ్..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



