బాబాయ్ బాలయ్యను నామినేట్ చేసిన తారక్
on Apr 21, 2020

ట్విట్టర్‌లో ఇప్పుడొక ఛాలెంజ్ నడుస్తూ ఉంది... #BeRealMan అని! ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్టార్ట్ చేశారు. ఇంటి పనులన్నీ భార్యల మీద పడేయకుండా, లాక్‌డౌన్ సమయంలో ఇంటి పనుల్లో ఆమెకు అండగా ఉంటూ నిజమైన మగాడు అనిపించుకుందామని ఆయన అన్నారు. అంతే కాదు... రాజమౌళికి సవాల్ విరిశారు. రాజమౌళి ఇంటి పనులు చేసి... ఎన్టీఆర్, రామ్ చరణ్, నిర్మాత శోభు యార్లగడ్డ, దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు కీరవాణికి ఛాలెంజ్ విసిరారు. రాజమౌళి ఛాలెంజ్‌కి ఎన్టీఆర్ స్పందించారు.
"మన ఇంట్లో ప్రేమలు, ఆప్యాయతలే కాదు... పనులు కూడా పంచుకుందాం. పనిఒత్తిడి పంచుకున్నప్పుడు సరదాగా ఉంటుంది" అని తాను ఇల్లు వాకిలి శుభ్రం చేసి, వంట పాత్రలు తుడిచిన వీడియో ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "బాల బాబాయ్ (నందమూరి బాలకృష్ణ), చిరంజీవి గారు, నాగార్జున బాబాయ్, వెంకటేష్ గారు, శివ కొరటాలను ఈ ఛాలెంజ్‌లో పాల్గొనాలని నామినేట్ చేస్తున్నా" అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



