'ఆచార్య' రిజల్ట్ పై మెగాస్టార్ కామెంట్స్!
on Jul 24, 2022

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో 'ఆచార్య' మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషించాడు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం దారుణ ఫలితాన్ని మూటగట్టుకుంది. బయ్యర్లకు దాదాపు రూ.80 కోట్ల నష్టాలు తెచ్చినట్లు టాక్. ఇటీవల బయ్యర్లు నష్టాలను భర్తీ చేయాలంటూ మూవీ ఆఫీస్ ని చుట్టుముట్టారని న్యూస్ వినిపించింది. భారీ ధరకు శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న ఛానల్ కూడా డీల్ క్యాన్సిల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని ప్రచారం జరుగుతోంది. తన కెరీర్ లో ఎన్నో సంచలన విజయాలను అందుకున్న మెగాస్టార్ కు ఆచార్య ఓ చేదు జ్ఞాపకంలా మిగిలింది. తాజాగా ఈ మూవీ ఫలితంపై పరోక్షంగా స్పందించారు చిరంజీవి.
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించిన 'లాల్ సింగ్ చడ్డా' చిత్రాన్ని తెలుగులో చిరంజీవి సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య కీలక పాత్ర పోషించిన ఈ మూవీ ఆగష్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ తో కలిసి ఆమిర్, చైతన్య ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఆమిర్ పై ప్రశంసలు కురిపించారు.
ఆమిర్ దేశం గర్వించ దగ్గ నటుడని, ఈ సినిమాని సమర్పించడం తనకు గర్వంగా ఉందని అన్నారు. ఆమిర్ విభిన్న చిత్రాలు, విభిన్న పాత్రలతో అలరిస్తాడని.. తానైతే ఇప్పుడు ఆమిర్ చేస్తున్న సినిమాలు చేయలేనని చెప్పారు. ఆమిర్ ప్రయోగాలు చేస్తూనే, జనాలను మెప్పిస్తాడని.. కానీ తాను మాత్రం జనాలు ఏం చేస్తే చప్పట్లు కొడతారని ఆలోచించి, మినిమమ్ గ్యారెంటీ సినిమాలు చేస్తానని అన్నారు. అయితే మధ్య మధ్యలో మన ప్రమేయం లేకుండా కొన్ని కొన్ని జరిగిపోతుంటాయి, వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడొద్దు అంటూ చిరంజీవి నవ్వేశారు. మెగాస్టార్ చేసిన కామెంట్స్ ఆచార్యను ఉద్దేశించే అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



