బన్నీ నయా అవతార్.. తగ్గేదేలే!
on Jul 24, 2022

టాలీవుడ్ హీరోల్లో డ్రెస్సింగ్ స్టైల్, లుక్స్ పరంగా అల్లు అర్జున్ కి స్పెషల్ క్రేజ్ ఉంది. తన స్టైలిష్ లుక్స్ వల్లనే స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే 'పుష్ప: ది రైజ్' నుంచి ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. పుష్పలో క్యారెక్టర్ దృష్ట్యా కాస్త డీ గ్లామరస్ గా కనిపించాడు. అయినప్పటికీ తన మ్యానరిజమ్స్, స్టెప్పులతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం 'పుష్ప: ది రూల్' కోసం రెడీ అవుతున్న బన్నీ.. లుక్స్ పరంగా ఇటీవల కాస్త ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. తాజాగా ఆ ట్రోల్స్ కి తన అదిరిపోయే లుక్ తో సమాధానమిచ్చాడు.
తాజాగా బన్నీ ట్విట్టర్ వేదికగా తన లేటెస్ట్ ఫోటోని షేర్ చేశాడు. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఆ ఫొటోలో లాంగ్ హెయిర్ తో స్టైలిష్ గా ఉన్నాడు బన్నీ. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 'ఇండియన్ స్టైల్ ఐకాన్' అంటూ #AlluArjun #PushpaTheRule హ్యాష్ ట్యాగ్ లను బన్నీ ఫ్యాన్స్ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నాడు. పుష్పరాజ్ పాత్ర మేకోవర్ లో భాగంగా బన్నీ కొంత బొద్దుగా మారి, స్టైల్ గా లేడని.. దానికే కొందరు ట్రోల్ చేశారని.. అలాంటి వారికి తన స్టైలిష్ లుక్ తో ఆన్సర్ చెప్పాడంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



