అత్యధిక ఆదాయపు పన్ను చెల్లింపుదారుడు రజనీకాంత్!
on Jul 25, 2022

సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ జూలై 24న గౌరవించింది. తమిళనాడులో అత్యధికంగా, అత్యంత సక్రమంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారునిగా ఆయనకు గుర్తింపు లభించింది. జూలై 24న జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ నుంచి పురస్కారాన్ని రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్య అందుకున్నారు. చాలా సంవత్సరాల నుంచీ తమిళనాడులో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ రజనీయే. ఇక దేశంలోనే అత్యధికంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారునిగా నిలిచారు అక్షయ్ కుమార్. ఐటీ డిపార్ట్‌మెంట్ నుంచి ఆయన ఓ సర్టిఫికెట్‌ను అందుకున్నారు.
శనివారం చెన్నైలో ఇన్‌కమ్ టాక్స్ డేను నిర్వహించారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సక్రమంగా పన్ను చెల్లిస్తున్న వారిని పురస్కారాలతో గౌరవించారు. రజనీకాంత్ తరపున ఆయన కుమార్తె ఐశ్వర్య అవార్డును అందుకున్నారు. ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా, "Proud daughter of a high and prompt taxpayer. Many thanks to the #incometaxdepartment of Tamilnadu and Puducherry for honouring appa on #incometaxday2022 #onbehalfofmyfather (sic)." అని షేర్ చేశారు.
రజనీకాంత్ చివరిసారిగా శివ డైరెక్ట్ చేసిన 'అణ్ణాత్తే'లో నటించారు. నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్‌లో 'జైలర్' అనే మూవీ చేయడానికి రెడీ అవుతున్నారు. హైదరాబాద్‌లో ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో ఈ మూవీ సెట్స్ మీదకు వస్తోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



