ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న బెస్ట్ యాక్షన్ మూవీస్ ఇవే...
on Aug 29, 2020

ప్రపంచవ్యాప్తంగా హయ్యెస్ట్ గ్రాసర్స్‌లో ఎక్కువగా కనిపించేవి యాక్షన్ సినిమాలే. ఫైట్లను ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు? భారీతనంతో, కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో, అసాధారణమనిపించే ఫీట్లతో, ఒళ్లు గగుర్పాటు కలిగించేలా హీరోలు, విలన్ల మధ్య భీకరంగా, బీభత్సంగా నడిచే యాక్షన్ ఎపిసోడ్లను చూస్తూ మనలో చాలా మంది తమను తాము మరచిపోయి, తాము కూర్చున్న కుర్చీల్లోనే రకరకాల విన్యాసాలు చేసేవాళ్లను మనం గమనిస్తుంటాం. యాక్షన్ సీన్లకు అంతటి శక్తి ఉంది మరి.
ప్రస్తుతం లాక్‌డౌన్ పీరియడ్‌లో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఎన్నో యాక్షన్ సినిమాలు మనకు అందుబాటులో ఉన్నాయి. కత్తి యుద్ధాలతో రంజింపజేసే యుద్ధాల నుంచి, గన్స్‌తో దడదడలాడించే ఫైట్ల నుంచి, మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలతో అలరించే యాక్షన్ దాకా.. ఎన్నో యాక్షన్ సినిమాలు మన ముందున్నాయి. వాటిలో బెస్ట్ అనదగ్గ కొన్నింటి పేర్లను మీ ముందుంచుతున్నాం.. చూసి యాక్షన్‌లో తేలియాడటమే ఆలస్యం...
1. ద రెయిడ్: రిడెంప్షన్ (2011)
డైరెక్టర్: గారెత్ ఇవాన్స్
ఐఎండీబీ రేటింగ్: 7.6
స్ట్రీమింగ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
2. మ్యాడ్ మ్యాక్స్: ఫ‌్యూరీ రోడ్ (2015)
డైరెక్టర్: జార్జ్ మిల్లర్
ఐఎండీబీ రేటింగ్: 8.1
స్ట్రీమింగ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
3. ఎడ్జ్ ఆఫ్ టుమారో (2014)
డైరెక్టర్: డౌగ్ లైమన్
ఐఎండీబీ రేటింగ్: 7.9
స్ట్రీమింగ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
4. డెడ్‌పూల్ (2016)
డైరెక్టర్: టిమ్ మిల్లర్
ఐఎండీబీ రేటింగ్: 8
స్ట్రీమింగ్: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
5. 1917 (2019)
డైరెక్టర్: శామ్ మెండెస్
ఐఎండీబీ రేటింగ్: 8.3
స్ట్రీమింగ్: సోనీ లైవ్
6. వార్ (2019)
డైరెక్టర్: సిద్ధార్థ్ ఆనంద్
ఐఎండీబీ రేటింగ్: 6.5
స్ట్రీమింగ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
7. ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ట్రైలజీ (2001, 2002, 2003)
డైరెక్టర్స్: పీటర్ జాక్సన్
ఐఎండీబీ రేటింగ్: 8.8, 8.7, 8.9
స్ట్రీమింగ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
8. డేర్‌డెవిల్ (2003)
డైరెక్టర్: మార్క్ స్టీవెన్ జాన్సన్
ఐఎండీబీ రేటింగ్: 5.3
స్ట్రీమింగ్: నెట్‌ఫ్లిక్స్
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



