రజనీ ప్లేస్ లోకి లారెన్స్ వచ్చేశాడు..!
on May 13, 2016

అప్పట్లో చంద్రముఖి అన్న సినిమా ఒక ట్రెండ్ ను క్రియేట్ చేసింది. ఇక అయిపోయిందనుకున్న రజనీ కెరీర్ ను తిరిగి నిలబెట్టింది. హర్రర్ కామెడీ ట్రెండ్ ను మొదలెట్టిన ఆ సినిమా, కలెక్షన్లు ఎంతలా కుమ్మేసుకుందో అందరికీ తెలిసిందే. కానీ దర్శకుడు పి వాసు మాత్రం తర్వాత మరో విజయాన్ని సాధించలేకపోయాడు. వెంకటేష్ తో నాగవల్లి అనే చంద్రముఖి సీక్వెల్ ట్రై చేసినా ఫ్లాప్ ఖాతాలో పడింది. అయినా వాసు పట్టు విడవలేదు. ఇప్పుడు మరో సీక్వెల్ ను చంద్రముఖి 2 ను పేరుతో తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నాడట. పైగా ఇప్పుడు హర్రర్ కామెడీ ట్రెండ్ నడుస్తోంది కాబట్టి, ఎలాగైనా ఒక హిట్టు కొట్టాలని డిసైడ్ అయ్యాడని తమిళ తంబీలు అంటున్నారు. పేరుకు చంద్రముఖి 2 అయినా, ఇది కన్నడలో సూపర్ హిట్ అయిన శివలింగ అనే సినిమాకు రీమేక్. ఈ మధ్య ముని, కాంచన సీరీస్ లు తీసి హర్రర్ కామెడీలతో వరస హిట్లు కొట్టేస్తున్న లారెన్స్ ను ఈ సినిమాలో హీరోగా తీసుకుంటున్నాడని సమాచారం. మ్యాజిక్ అనేది ఒకసారి మాత్రమే జరుగుతుంది. మరి చంద్రముఖి రేంజ్ హిట్ ను వాసు మళ్లీ చూస్తాడా..చూద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



